Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michael Biopic: ఈ మధ్య బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ లు సాధారణంగా సెలెబ్రిటీల జీవితాలను తెరపై చూపిస్తుంటాయి. ఎక్కువ శాతం ఇలాంటి స్టోరీలు మంచి విజయాలనే నమోదు చేశాయి. అయితే రీసెంట్ గా వచ్చిన ఒక బయోపిక్ మాత్రం బాక్సాఫీస్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. పాప్ సంగీత ప్రపంచాన్ని శాసించిన మైఖేల్ జాక్సన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మైఖేల్’ అరుదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు ఎన్నో వివాదాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన బయోపిక్‌గా చరిత్ర సృష్టించింది.
దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ చిత్రం 2026 ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందనను అందుకున్న ఈ సినిమా ఉత్తర అమెరికాలో సుమారు 372 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ మార్కెట్లలో 629 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా 1 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి, భారత కరెన్సీలో రూ.9,500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ విజయంతో గతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మ్యూజికల్ బయోపిక్ ‘బోహేమియన్ రాప్సడీ’ రికార్డును ‘మైఖేల్’ అధిగమించింది. సుమారు 911 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టి, మ్యూజికల్ బయోపిక్ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. అంతేకాదు, నిజ జీవిత వ్యక్తి ఆధారంగా రూపొందిన హాలీవుడ్ చిత్రాల్లో ‘ఒపెన్‌హైమర్’ నమోదు చేసిన సుమారు 975 మిలియన్ డాలర్ల కలెక్షన్లను కూడా అధిగమించడం విశేషంగా మారింది.
Also Read
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ..
ఈ చిత్రానికి జాన్ లోగన్ కథను అందించగా, మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ తన తొలి చిత్రంలోనే మైఖేల్ పాత్రను పోషించారు. ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, మైఖేల్ జాక్సన్ హావభావాలు, డాన్స్ స్టైల్, స్టేజ్ ఎనర్జీకి ప్రశంసలు దక్కాయి. ‘మైఖేల్’ కథ జాక్సన్ బాల్య ప్రయాణం నుంచి ప్రపంచ పాప్ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన స్టార్‌గా ఎదిగిన దశ వరకు సాగుతుంది. విడుదలకు ముందు పలు వివాదాలు ఎదురైనా, ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ ఆదరణతో ఈ చిత్రం బయోపిక్‌లకు కొత్త ప్రమాణాన్ని సృష్టిస్తూ ప్రపంచ బాక్సాఫీస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
- Tags
- cinema
- Michael Biopic
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!