Site icon NTV Telugu

అమెజాన్ ప్రైమ్‌లో ‘మెరిసే… మెరిసే’!

Merise Merise

Merise Merise

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. ఈ ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఆగ‌స్ట్ 6న థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. అయితే చిత్రంగా కేవలం రెండు వారాల్లోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత వెంక‌టేశ్ కొత్తూరి మాట్లాడుతూ ”కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో వ‌చ్చిన మా సినిమా మెరిసే మెరిసే చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు ఆద‌రించారు. సినిమా బావుంటుందంటూ రివ్యూయ‌ర్స్ కూడా అప్రిషియేట్ చేశారు. స్త్రీ సాధికార‌త అనే అంశాన్ని ప్రేమ క‌థ‌కు ముడిపెట్టి వివ‌రించిన తీరు ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో మెరిసే మెరిసే అందుబాటులోకి వ‌చ్చింది. దినేష్ తేజ్‌, శ్వేతా అవ‌స్థి స‌హా న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ పాయింట్స్‌.. ఈ జ‌న‌రేష‌న్‌లో కెరీర్ ప‌రంగా యూత్.. ముఖ్యంగా మ‌హిళ‌లు ఎలా ఆలోచిస్తున్నార‌నే పాయింట్‌ను క‌నెక్టింగ్‌గా చెప్పాం” అని అన్నారు.

Exit mobile version