NTV Telugu Site icon

Memories: కుర్ర హీరో పాన్ ఇండియా మ్యూజిక్ వీడియో.. రిలీజ్ చేసిన అడివి శేష్

Memories Song

Memories Song

Memories Song Released by Adivi sesh: నారాయణ అండ్ కో సినిమా తర్వాత హీరో సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’ అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించగా అమెరికాలోని శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. ‘మెమొరీస్’ వీడియో సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివృతి వైబ్స్ యూట్యూబ్ వేదికపై రిలీజ్ అయింది. అందులో భాగంగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ నివృతి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది.

Animal : రష్మిక నటనకు ఫిదా అవుతున్న నెటిజన్స్..

గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన ‘చోటు’ అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం ‘మనోహరం’కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుందని అంటున్నారు. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది. ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేయగా తెలుగులో రాహుల్ సిప్లిగంజ్, కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది. ఇక హిందీలో రితేష్ జి రావు , మలయాళంలో అర్జున్ విజయ్,తమిళ్ లో సుస, ఈ సాంగ్ పాడారు. బ్రయన్ డర్కీ కెమెరా అందించగా సాంగ్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.