Site icon NTV Telugu

Mehreen: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న మెహ్రీన్ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Mehreen Pirzadaa Thumb

Mehreen Pirzadaa Thumb

Mehreen Fire on Fake news about her Pregnancy: ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. తాజాగా ఆ లిస్టులో మెహ్రీన్ పిర్జాదా చేరారు. తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు మెహ్రీన్ పిర్జాదా స్వయంగా తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ‘ఈ ప్రక్రియకు వెళ్లడానికి నా మనసును సిద్ధం చేసుకోవడానికి 2 సంవత్సరాలు ప్రయత్నించా. చివరకు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని మెహ్రీన్ పేర్కొన్నారు. ఎగ్ ఫ్రీజింగ్ కోసం మెహ్రీన్ ఎంతలా కష్టపడ్డారో వీడియో చూస్తే అర్థమవుతుంది. ‘నా వ్యక్తిగత విషయాన్ని అందరితో పంచుకోవాలా? వద్దా? అని ఆలోచించా. కానీ నాలాంటి చాలా మంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు.

Thindibothu Deyyam: అసలే దెయ్యం, ఆపై తిండిబోతు.. ఇక కాస్కోండి!

ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో లేదా బిడ్డను ఎప్పుడు కనాలో అని ఇంకా వారు నిర్ణయించుకోలేదు, భవిష్యత్తు కోసం ఇలా చేయడం చాలా ముఖ్యం అని నేను భావించా. తల్లి కావాలనేది నా కల, అయితే కొన్ని సంవత్సరాలు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆసుపత్రులంటే ఫోబియా ఉన్న నాలాంటి వారికి ఇది సవాలు అని మెహ్రీన్ పిర్జాదా చెప్పుకొచ్చింది. అయితే తెలుగు మీడియాలో కొందరు ఈ అంశం మీద అవగాహన లేక మెహ్రీన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది అంటూ వార్తలు రాశారు. అందులో ఒకటి మెహ్రీన్ దృష్టికి రావడంతో ఈ విషయం మీద ఫైర్ అయింది. మీరు దయచేసి అసలు విషయం తెలుసుకోండి, దయచేసి తప్పుడు వార్తలు మీరు స్ప్రెడ్ చేయకండి. ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటే ఏమిటి అనేది దయచేసి వెళ్లి తెలుసుకోండి అంటూ ఆమె

Exit mobile version