NTV Telugu Site icon

Meher Ramesh: చిరంజీవితో రీమేక్ అంటే రిస్కని తెలిసి కూడా అందుకే చేశా!

680681514 Happy Birthday Meher Rames 640 360

680681514 Happy Birthday Meher Rames 640 360

Meher Ramesh Reveals reason behind doing vedalam Remake:మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్‌’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మిస్తుస్తుండగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వేదాళం రీమేక్ చేయడానికి కారణం ఏమిటి ? అని అడిగితే చిరంజీవి గారిని అన్నయ్య అని పిలవడం తప్పితే మరో పదం ఉండదని ఈ సినిమాలో కూడా అన్నయ్య తత్వం వుందని, అది నాకు చాలా నచ్చిందని అన్నారు. జనరేషన్ మారిపోయినా అనుబంధాలు అలానే వున్నాయని పేర్కొన్న ఆయన . యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్రదర్ సిస్టర్ ఎమోషన్స్ వున్న కథ ఇదని అన్నారు. నేను ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడూ డీల్ చేయలేదని పేర్కొన్న ఆయన చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్టుగా ఇందులో మార్పులు చేశామని, సెకండ్ హాఫ్ చిరంజీవి గారికి ఇచ్చిన ట్రీట్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు.

Game Changer: చరణ్ పాత్రకి పవన్ కొడుకు పేరు.. ఇక మెగా ఫాన్స్ ఆగుతారా?

ఒరిజినల్ కి దాదాపు 70 శాతం మార్పులు చేశాం. అన్నయ్య నాకు ఎలా కనిపిస్తారో అది ఈ సినిమాలో చూపించా అని అన్నారు. ఇప్పుడు రీమేక్ అంటే రిస్క్ కదా .. ఈ రిస్క్ ఎలా తీసుకున్నారు ?అని అడిగితే రిస్క్ కంటే బిగ్ టాస్క్ అనుకున్నామని అన్నారు. బిల్లా కూడా టాస్కే, అక్కడ ప్రభాస్ ని ఎలా చూపించాలనేది నా టేక్. అలాగే భోళా శంకర్ కూడా రీమేక్ చేయడం పెద్ద టాస్క్ అని ఆయన అన్నారు. ఒక పెద్ద సక్సెస్ అయిన దానిని కరెక్ట్ గా తీయడంతో పాటు జనాలకు నచ్చేలా తీయాలని అందుకే భోళా శంకర్ ని ప్రేక్షకులకు నచ్చేలా ప్రజంట్ చేశామని అన్నారు. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ తర్వాత ఎలా తీద్దామని అనుకున్నానో అలానే తీశానని, ఇందులో చిరంజీవి గారి మార్క్ ఉంటే కొత్తగా ఉంటుందని అన్నారు. చిరంజీవి గారి సినిమా నుంచి కావాల్సిన అన్ని అంశాలు భోళా శంకర్ లో వుంటాయని పేర్కొన్న అయన అడిషనల్ గా చిరు లీక్స్ ద్వారా వచ్చిన పవర్ స్టార్ గారి మేనరిజం కూడా అని అన్నారు. అన్నయ్య పై వున్న ప్రేమ అభిమానం చూపించడానికి ఈ కథ నా కోసం ఎదురుచూసిందని ఆయన అన్నారు.