హీరోయిన్ మేఘా ఆకాష్ టాలీవుడ్ లో మంచి హిట్ కోసం తెగ ప్రయత్నిస్తుంది.. ఈ క్రమంలో వరుస చిత్రాల ను చేస్తుంది.. రీసెంట్ గా ‘రావణసుర’తో ప్రేక్షకుల ముందు కు వచ్చింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.మేఘా ఆకాష్ తన కేరీర్ ను తెలుగు చిత్రాలతోనే మొదలు పెట్టింది.నితిన్ సరసన ‘లై’, మరియు ‘ఛల్ మోహన రంగ’ వంటి చిత్రాల్లో నటించింది. మేఘాకు ఈ రెండు చిత్రాలు అంత గా గుర్తింపు రాలేదు. తెలుగు సినిమాలు పెద్ద గా వర్కౌట్ కాకపోవడం తో రూట్ మార్చి కోలీవుడ్ కు చేరింది.. అక్కడా వరుస పెట్టి సినిమాలను చేసింది. కానీ పెద్ద హిట్ అయితే అందుకోలేక పోయింది. ప్రేక్షకుల్లో మాత్రం తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ఈ అమ్మడు అటు హిందీ లో కూడా అవకాశాలను దక్కించుకుంది.. అక్కడ కొన్ని చిత్రాల్లో నటించి మళ్లీ దక్షిణాది చిత్రాల పైనే ఎక్కువ ఫొకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా షూటింగ్ దశ లో ఉన్నాయి.ఈ అమ్మడు సోషల్ మీడియా లో క్రేజ్ దక్కించుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. అభిమానులకు తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ భామ సంప్రదాయ దుస్తుల్లో కూడా బాగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఆమె బ్లాక్ శారీ లో మెరిసింది. ఎప్పుడు మోడ్రన్ డ్రస్సుల్లో దర్శనమిచ్చే మేఘా ఆకాష్ తాజాగా మాత్రం చీరకట్టు లో బాగా ఆకట్టుకుంది.బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్నమేఘా తన స్మైల్ తో అందరిని అలరించింది.ప్రస్తుతం మెఘా ఆకాష్ సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా ఉంటుంది.. సోషల్ మీడియా లో ఈ బ్యూటీ కూడా బ్యూటీఫుల్ లుక్స్ లో అదరగొడుతుంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.