ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లో రెండు ప్రాజెక్టులు ప్రత్యేకంగా ఆసక్తి రేపుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’, అలాగే దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న పూర్తి స్థాయి ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్’. ఈ రెండు సినిమాలు చిరంజీవి కెరీర్‌లో మైలురాళ్లుగా నిలుస్తాయని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కాగా ‘విశ్వంభర’ విషయానికొస్తే, ఇప్పటికే రెండు టీజర్లు, కొన్ని పోస్టర్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ కొత్త అప్డేట్స్ మాత్రం ఎక్కువగా రాలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు. ఇక మరోవైపు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్’ మాత్రం వరుస అప్‌డేట్స్ తో దూకుడు చూపిస్తోంది. షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుండగా, ప్రమోషన్లలో కూడా మేకర్స్ ఎటువంటి గ్యాప్ లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ దసరా కానుకగా, ‘మన శంకర వరప్రసాద్’ నుంచి మొదటి పాటను రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఈ వార్తతో మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ‘విశ్వంభర’ కంటే ముందే ఈ ఎంటర్టైనర్ నుంచి ఫస్ట్ ట్రీట్ రానుందా అన్న సందేహం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, ఈ వార్తల వెనుక ఎంతవరకు నిజం ఉందో మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం ఖాయం – ఈ దసరా సీజన్ మెగాస్టార్ అభిమానులకు ప్రత్యేకమైన ఆనందాన్ని అందించే అవకాశాలు చాలా ఉన్నాయి.
