Site icon NTV Telugu

Chiranjeevi: ధైర్యంగా ఉండు సమంత.. సమస్యలు తొలగిపోతాయి

Chiru

Chiru

Chiranjeevi: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి సమంత చికిత్స తీసుకొంటుందని వార్తలు వచ్చినా వాటిని పుకార్లు అని కొట్టేశారు. కానీ, తాజాగా సమంతనే స్వయంగా తాను మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నానని చెప్పుకురావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీతో పాటు అభిమానులు కూడా ఉలిక్కిపడ్డారు. సామ్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు.

తాజాగా మెగాస్టా చిరంజీవి సైతం సామ్ కు దైర్యం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ” కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు ఎదురవుతుంటాయి. మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోడానికి ఆ సవాళ్లు ఎదురవుతాయి. సమంత ఒక అద్భుతమైన అమ్మాయి.. ఆమె అంతర్గతంగా ఎంతో ధైర్యంగా ఉంటుంది. సమంత అతి త్వరలోనే అనారోగ్య సమస్య నుంచి బయపడుతుందని అనుకుంటున్నాను.సమంత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version