NTV Telugu Site icon

Chiranjeevi: జగదేకవీరుడు- అతిలోక సుందరి సీక్వెల్ అయితే కాదుగా..?

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు సైతం చెమటలు పట్టిస్తున్నాడు. ఇక తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బింబిసార సినిమా డెబ్యూ హిట్ అందుకున్నాడు కుర్ర డైరెక్టర్ వశిష్ఠ. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తరువాత వశిష్ఠ ఏ హీరోతో సినిమా చేస్తాడో అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ కుర్ర డైరెక్టర్.. చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్.. వశిష్ఠను ఇబ్బంది పెడుతున్నారని, చిరు సినిమా ఓ రేంజ్ లో ఉండాలని చెప్పుకొచ్చినట్లు కూడా వచ్చాయి. వీటిపై వశిష్ఠ అసహనం కూడా వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. దీంతో ఇదంతా కూడా రూమర్స్ మాత్రమే అనిఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు.

Mahesh Babu: తమిళ తంబీలు ‘గిల్లి’ మరీ తిట్టించుకున్నట్టున్నారే

ఇక తాజగా అందుతున్న సమాచారం ప్రకారం.. చిరు- వశిష్ఠ కాంబో సెట్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా ఇండియానా జోన్స్ ఫ్రాంచైజీ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ గా ఉండనున్నదట.. అంతేకాకుండా దానికి ఫాంటసీ టచ్ కూడా యాడ్ చేస్తున్నారని అంటున్నారు. చిరు నటించిన అన్ని చిత్రాల్లో ఫాంటసీ అంటే జగదేక వీరుడు- అతిలోక సుందరి సినిమానే గుర్తొస్తుంది. అప్పట్లోనే ఆ విజువల్స్ అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ రాఘువేంద్ర రావు. ఇక ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది.. అలాంటి ఫాంటసీతో సినిమా అంటే జగదేక వీరుడు- అతిలోక సుందరి సీక్వెల్ గానీ తీయడం లేదు కదా అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా సినిమా మాత్రం అద్భుతంగా ఉండాలని మెగా ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాలను పెంచేసుకుంటున్నారు. త్వరలోనే ఈ కాంబో అధికారిక ప్రకటన రానుంది.

Show comments