Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. అక్టోబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో నిర్వహించారు. బోరున వర్షం పడుతున్నా మెగాస్టార్ స్పీచ్ ఆపలేదు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ఒక సెంటిమెంట్ ఇప్పటికి రిపీట్ అవుతోంది.. నేను ఎప్పుడు రాయలసీమ వచ్చినా.. ఈ నేల వర్షంతో తడుస్తోంది. నేను పొలిటికల్ గా క్యాంపైన్ పులివెందులలో చేసినప్పుడు కానీ, ఇంద్ర సినిమాలో సాంగ్ పాడినప్పుడు కూడా ఇలాగే వర్షం కురిసింది. ఇప్పుడు ఇలా వర్షం కురవడం అనేది ఒక శుభపరిమాణంలా అనిపిస్తోంది.. వరుణ దేవుడు నాకిచ్చిన ఆశీర్వాదాలు అనుకుంటాను అని చెప్పుకొచ్చాడు. ఇక మాట్లాడేముందు ఈరోజు జరిగిన విషాదాన్ని చిరు తలుచుకున్నారు. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మృతిపట్ల చిరు ప్రఘాడ సంతాపం వ్యక్తం చేశారు. రాయలసీమలో వర్షాలు పడక నేల నెరులు చాస్తుంటే చిరంజీవి వచ్చాడు.. వర్షం వస్తోంది అని వరుణుడు ఇక్కడకు వర్షాన్ని పంపించాడు. అదే సెంటిమెంట్ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యింది. ఇక వైజాగ్ లో సినిమా షూటింగ్ చేసి వస్తుంటే ఫ్లైట్ డీలే అయ్యింది.. రాగలనా లేదా అనుకున్నాను.. కానీ మీ అందరి అభిమానం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని చెప్పుకొచ్చారు. ఇక సినిమా గురించి ఆయన మాట్లాడుతూ లూసిఫర్ మలయాళంలో రిలీజ్ అయ్యినప్పుడు నేను చూశాను. ఈ గాడ్ ఫాదర్ గా మారడానికి ప్రధాన కారణం రామ్ చరణ్. సినిమా బావుంది.. వైవిధ్యంగా ఉంది అని అనుకున్నాను.. కానీ చరణ్ వచ్చి ఈ సినిమా మీరు చేస్తే బావుంటుంది.. ఈ ఏజ్ లో మీరు చేయాల్సిన సినిమా.. గాడ్ ఫాదర్ గా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఈ సినిమా రూపాంతరం చెందింది. ఇక డైరెక్టర్ ను కూడా చరణ్ సాజిస్ట్ చేశాడు. తనతో ధృవ సినిమా తీసిన మోహన్ రాజా అయితే బావుంటుందని కూడా చరణే చెప్పాడు. చాలా మంచి సజిషన్.. అతను అయితే కరెక్ట్ గా ఉంటాడు. యంగ్ డైరెక్టర్, క్రియేటివ్ ఆలోచిస్తాడని తీసుకున్నాం. మోహన్ రాజా ఈ సినిమా ఎంత చక్కగా తీసాడంటే.. అందరు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే ను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది.
ఇక సత్యదేవ్ నటన అద్భుతంగా ఉంది. నాకు ధీటుగా విలనిజం పండించాడు. ఎంతో హార్డ్ వర్క్ చేసిన నటుడు.. ప్రస్తుతం అందరు అతనిని పొగుడుతున్నారు.. ముందు ముందు చాలా గొప్ప స్టార్ అవుతాడు. ఇక ఈ సినిమాకు ఆరోప్రాణం థమన్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. మ్యూజిక్ లేదు, సాంగ్స్ లేవు.. చిరంజీవి ఎందుకు ఈ సినిమా చేశాడు అని అందరు అనుకున్నారు.. అందుకు కారణం థమన్.. ఇది పొలిటికల్ డ్రామానే కాదు మ్యూజికల్ డ్రామా కూడా. ఇక ఇంత చిన్న వయస్సులోనే నేషనల్ అవార్డు అందుకున్న థమన్ ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించాడు. ఇక నాకు అసిస్టెంట్ గా ఉండడానికి ఒక దళపతి కావాలి.. చిరంజీవి లాంటి వారు కావాలి ఎవరు అనుకుంటుండగా సల్మాన్ ఖాన్ అని డైరెక్టర్ చెప్పడంతో రామ్ చరణ్ ఒకే ఒక ఫోన్ కాల్ చేయడంతో ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. ఇక అందరూ అయిపోయారు., చివరగా జర్నలిస్ట్ పాత్రలో ఎవరు అనుకుంటుండగా.. పూరి జగన్నాథ్ ను తీసుకుందామని అనగానే వెంటనే ఫోన్ చేసి నువ్వు చెయ్యాలి అని చెప్పాను. నేను చేయలేను అని చెప్పాడు.. అయినా నేను చూసుకుంటాను అని చెప్పి తీసుకొచ్చాను. ఈ సినిమలో నటించిన వారందరూ ఎంతో కష్టపడ్డారు. మేము అందరం ఎంత ప్రాణం పెట్టి ఈ సినిమాను చేసినా తుది నిర్ణయం ప్రేక్షకులదే.. మీరే ఈ సినిమాకు తుది తీర్పు ఇవ్వాల్సింది. ఇక ఈ మధ్య కాలంలో ఒక స్తబ్దత ఏర్పడింది.. విజయాపజయాలు వస్తూనే ఉంటాయి. కానీ, ప్రేక్షకులను అలరించలేకపోయామే.. వాళ్ళను అసంతృప్తికి గురిచేశామే అన్న బాధకు సమాధానమే ఈ సినిమా..” అని చెప్పుకొచ్చారు.