మెగాస్టార్ చిరంజీవి ఎంత బిజీగా ఉన్నా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలని చూస్తారు. ఏ సినిమా నచ్చినా వారిని వెంటనే పిలిపించి అభినందించడం లేదా ఫోన్ చేసి మాట్లాడడం, ఒక ట్వీట్ చెయ్యడం చిరుకి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన అలవాటు. ఇటివలే బలగం సినిమా నచ్చి, చిత్ర యూనిట్ ని అభినందించిన చిరు తాజాగా రంగమార్తాండ సినిమాని త్రివేణి సంగమం అంటూ ట్వీట్ చేసాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాకి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ లు నటించిన రంగమార్తాండ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. అన్ని సెంటర్స్ లో రంగమార్తాండ సినిమాకి ఎమోషనల్ జర్నీలా ఉంది, మంచి సినిమా చూసాము అనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. చిరు కూడా తన ఇంట్లో స్పెషల్ షో వేసుకోని మరీ రంగమార్తాండ సినిమా చూసి తన అభినందనలని తెలిపారు.
”నేను ‘రంగమార్తాండ’ చూశాను. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఇది ఒకటి. ప్రతి నటుడికి తన జీవితాన్నే కళ్ళ ముందు చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే, ఈ సినిమా ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందంల కలయిక, వాటి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరి నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది, బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్ర చేయడం తొలిసారి. సెకండ్ హాఫ్ అంతా అప్రయత్నంగానే కంట తడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇటువంటి సినిమాలు అందరూ తప్పకుండా చూసి ఆదరించాలి. కృషవంశీ, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ… చిత్ర బృందం అందరికీ అభినందలు” అంటూ చిరు ట్వీట్ చేశారు.
Kudos to #Rangamarthanda 👏👏@director_kv @prakashraaj #Brahmanandam @meramyakrishnan pic.twitter.com/spjo5FZlWw
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2023
