2020 టోక్యో ఒలంపిక్స్ లో ఇండియా రజత పతక విజేత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు మెగాస్టార్ సెల్యూట్ చేశారు. “మీరాబాయి చాను దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ గెలిచిన ఇండియన్. క్రీడల అనంతరం ఇంటికి చేరిన ఆమె అప్పటి నుంచి కొందరు వ్యక్తుల కోసం వెతుకుతూనే ఉంది. చివరికి వారందరినీ పిలిచి భోజనాలు పెట్టింది. మొత్తం 150 మంది. అందరికీ భోజనాలు పెట్టి, బట్టలు పెట్టి, కాళ్ళకి దణ్ణం పెట్టింది. ఇంతకీ వాళ్లంతా ఎవరో తెలుసా ? తన ఊరు నుంచి పాతిక మైళ్ళ దూరంలో ఉన్న ఇంఫాల్ స్పోర్ట్స్ అకాడమీకి వెళ్లేందుకు రోజూ మీరాబాయికి లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డ్రైవర్స్, క్లీనర్స్, హెల్పర్స్. ఇది కదా గెలుపు మలుపులో సాయం చేసిన ప్రతి ఒక్కటి పట్ల కృతజ్ఞత అంటే… సూపర్.. నీ మనసు బంగారం తల్లి” అంటూ మెగాస్టార్ మీరాబాయికి సెల్యూట్ చేశారు.
Read Also : తగ్గేదే లే : “పుష్ప” ఫస్ట్ సింగిల్ ప్రోమో
టోక్యో ఒలింపిక్స్ 2020లో మీరాబాయ్ చాను భారతదేశానికి మొదటి పతకాన్ని తెచ్చింది. 2000లో సిడ్నీలో జరిగిన ఒలంపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో లెజెండరీ కర్ణం మల్లీశ్వరి కాంస్యం సాధించి భారతదేశానికి గర్వకారణం అయ్యింది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత మీరాబాయి చాను మళ్ళీ రజతం సాధించడం విశేషం. టోక్యో గేమ్స్‌లో మహిళల 49 కేజీల విభాగంలో చాను సిల్వర్ మెడల్ గెలిచింది. మరోవైపు మెగాస్టార్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం ఆచార్య, లూసిఫెర్ రీమేక్, వేదాళం రీమేక్ ఉన్నాయి.
