Site icon NTV Telugu

Megastar Chiranjeevi: రియల్ హీరో కానిస్టేబుల్ రాజశేఖర్ కు సెల్యూట్ చేసిన మెగాస్టార్

Chiru

Chiru

Megastar Chiranjeevi: సాటి మనిషికి సాయం చేస్తేనే దేవుడు పంపాడు అంటాం.. అదే మనిషిని మరో మనిషిని కాపాడితే.. దేవుడే వచ్చాడు అంటాం. ప్రస్తుతం కానిస్టేబుల్ రాజశేఖర్ దేవుడే అని అంటున్నారు నెటిజన్లు. ఈరోజు ఉదయం రాజేంద్ర నగర్ సర్కిల్ దగ్గర ఉన్న బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్న ఒక యువకుడు అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న కానిస్టేబుల్ రాజశేఖర్ అతడికి సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు నిలబెట్టాడు. అక్కడ రాజశేఖర్ కనుక లేకుంటే సదురు యువకుడు ప్రాణాలు కోల్పోయేవాడు. సరైన సమయంలో తెగువ చూపించి ఒక వ్యక్తి ప్రాణాలు నిలబెట్టిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి పోలీసులే దేశానికి కావాలంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ రియల్ హీరో చేసిన మంచిపనిపై మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియా వేదికగా రియల్ హీరోకు సెల్యూట్ చేశాడు.

Case Of Husband Against Wife: అది మర్చిపోయిన భర్త.. శివాలెత్తిన భార్య.. కట్ చేస్తే..

“ఎంతో చురుకుగా.. సమయానికి సీపీఆర్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్ కు నా సెల్యూట్. శ్రీ రాజశేఖర్ గారు, మీ కర్తవ్యాన్ని మించి, సాటి మనిషి పట్ల కనికరం చూపడంలో మీరు మానవత్వానికి & సంరక్షణ మరియు స్నేహపూర్వక పోలీసులకు ఆదర్శంగా నిలిచారు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు సైతం రాజశేఖర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Exit mobile version