NTV Telugu Site icon

Chiranjeevi: నాకు తెల్సిన బ్రహ్మానందం అంటూ చిరు ట్వీట్.. వైరల్

Chiru

Chiru

Chiranjeevi: ఇండస్ట్రీలో ఎవరి పుట్టినరోజు అయినా.. మెగాస్టార్ చిరంజీవి విష్ లేకుండా పూర్తవదు. ఆయనకు అత్యంత ఆప్తులు అయితే ఆయనే స్వయంగా వారి ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి బర్త్ డే విషెస్ తెలుపుతారు. తాజాగా చిరుకు అత్యంత ఆప్తుడైన బ్రహ్మానందం నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో నేడు చిరు.. బ్రహ్మీ ఇంటికి వెళ్లి ఆయనకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపాడు. పుష్పగుచ్చంతో పాటు బ్రహ్మానందంకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించాడు. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ.. బ్రహ్మానందంతో ఉన్న ఆయన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు చిరు.

Virushka: ఆఖరికి ప్రియాంక కూడా చూపించేసింది.. మీరెప్పుడు చూపిస్తారయ్యా

“నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలి లో ఒక లెక్చరర్. ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీ కి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చెయ్యక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయ పూర్వక శుభాభినందనలు. బ్రహ్మానందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ,పదిమందిని నవ్విస్తూ వుండాలని, బ్రహ్మానందం కి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు వుండాలని,తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తనకి నా జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఇక ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రామ్ ప్రసాద్, రాకేష్ రాఘవ, రచ్చ రవి తదితరులు పాల్గొన్నారు.

Show comments