NTV Telugu Site icon

Megastar Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. ప్రకటించిన కేంద్రం

Chiru

Chiru

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకలు గోవాలో జరుగుతున్న విషయం తెల్సిందే. భారత 53వ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ 2022గా చిరంజీవిని ఎంపిక చేశారు. మరో రెండు రోజుల్లో చిరు గోవాకు పయనం కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, చిరంజీవిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

“ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ 2022.. చిరంజీవి జీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా, నటుడిగా, డ్యాన్సర్ గా & నిర్మాతగా 150 చిత్రాలకు పైగా విశిష్టమైన కెరీర్‌ను కలిగి ఉన్నారు. అతను హృదయాలను హత్తుకునే అద్భుతమైన ప్రదర్శనలతో తెలుగు సినిమాల్లో విపరీతమైన ప్రజాదరణ పొందారు. చిరంజీవి గారికి శుభాకాంక్షలు”అని తెలిపారు. ఇక దీంతో టాలీవుడ్ మొత్తం చిరుకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఇక ఈ విషయం విన్న వెంటనే వివి వినాయక్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవికి ఈ అవార్డు రావడం ఎంతో ఆనందానికి గురి చేస్తోంది అని అన్నారు. మొదటి నుంచి నియమ నిబద్దతలతో చిరు పడిన కష్టానికి ప్రతిఫలం అని చెప్పుకొచ్చారు.