మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోష్ పెంచుతున్నాడు. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్దమవుతుండగా లూసిఫర్ సెట్స్ మీద ఉంది.ఇక వీటితో పాటు బాబీ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న చిరంజీవి నేడు దానికి కూడా కొబ్బరికాయ కొట్టారు. మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కనున్న ఈ చిత్రం నేడు పూజాకార్యక్రమాలతో మొదలయ్యింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. కళ్ళకు గాగుల్స్, చేతిలో సిగరెట్ తో మాస్ లుక్ లో కనిపించాడు. ఈ పోస్టర్ చూసినవారందరు ముఠామేస్త్రి చిత్రాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. మాస్ మూల విరాట్ అవతారంలో అన్నయ అరాచకము మొదలు అంటూ దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
మెగాస్టార్ మాస్ లుక్.. అరాచకం ఆరంభం..

megastar