Mega158 : ఫాదర్స్ డే పిక్స్ లో కనిపించని చిరు… ఇదేనా కారణం ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega158 : విడుదలకు ముందే సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ఎన్నో వ్యూహాలు అనుసరిస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల కొత్త లుక్ విషయంలో అయితే ఒక్క చిన్న గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా158’ విషయంలో కూడా అలాంటి వ్యూహమే అమలవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫొటోలు అందుకు నిదర్శనంగా మారుతున్నాయి. ఆ ఫొటోల్లో ఎక్కడా చిరంజీవి కనిపించకపోవడం ఆసక్తిగా మారింది.
దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి తన తండ్రి చిరంజీవితో కొంత సమయం గడిపారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ కొన్ని బీహైండ్ ది సీన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఆ ఫొటోల్లో చిరంజీవి ఎక్కడా కనిపించకపోవడం అభిమానుల్లో ఊహాగానాలకు దారితీసింది. అయితే చిరంజీవి కొత్త లుక్‌ను ఇప్పుడే బయటపెట్టకూడదనే ఉద్దేశంతో చిత్రబృందం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ అనేక లుక్ టెస్టులు నిర్వహించినట్లు తెలుస్తోంది. చివరకు కథకు, పాత్రకు పూర్తిగా సరిపోయే గెటప్‌ను ఖరారు చేసిన తర్వాత దానిని ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్ ద్వారా అభిమానులకు పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
- Jayaho Ramanuja: సంస్కృతంతో సహా ఆరు భాషల్లో 'జయహో రామానుజ'
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బాబీ, చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందుతున్నట్లు సమాచారం. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ బ్యానర్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం కూడా ప్రత్యేకతగా మారింది. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పెతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ప్రియమణి కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి త్వరలోనే చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మెగాస్టార్ కొత్త అవతారం ఎలా ఉండబోతోందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Tags
- Chiranjeevi
- cinema
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!