Site icon NTV Telugu

Lal Singh Chaddha: మెగాస్టార్ సమర్పణలో వస్తున్న బాలీవుడ్ స్టార్ మూవీ

Lal Singh Chadda

Lal Singh Chadda

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో అమీర్‌ఖాన్‌ హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ ప్రివ్యూ షోకు అమీర్‌ఖాన్, చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్‌ కూడా హాజరయ్యారు. ఈ సినిమా వీక్షించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ సినిమాలో అమీర్ ఖాన్, నాగచైతన్య చాలా బాగా నటించారని ఆయన ప్రశంసించారు. ఇది అమీర్ కలల ప్రాజెక్టు అని.. ఈ సినిమాను వీక్షించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ తెలియజేశారు.

అయితే లాల్‌సింగ్ చద్దా మూవీ తెలుగు వెర్షన్‌లో కూడా విడుదలవుతోంది. తెలుగు వెర్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యహరిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తన సన్నిహిత మిత్రుడు అమీర్ ఖాన్ నటించిన ఎమోషనల్ చిత్రం తెలుగు వెర్షన్‌ను సమర్పించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చిరు అభిప్రాయపడ్డారు. అమీర్‌ను మరోసారి తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని పేర్కొన్నారు. కాగా పలు ఆస్కార్ అవార్డులు గెలిచిన హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా చిత్రంపై అమీర్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కరీనా కపూర్, మోనా సింగ్, మానవ్ విజ్, ఆర్యా శర్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తో కలిసి వయాకామ్18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Exit mobile version