Site icon NTV Telugu

Mega Star: ‘బ్రహ్మాస్త్ర’లో చిరంజీవి!

New Project (19)

New Project (19)

 

బాలీవుడ్ స్టార్ పెయిర్ రణబీర్ కపూర్, అలియాభట్ నటిస్తున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ హిందీ సినిమా ప్రధాన భారతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనూ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. మూడు భాగాలుగా అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ‘బ్రహాస్త్ర’ తొలి భాగం ‘శివ’. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు కింగ్ నాగార్జున సైతం కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ ను వైజాగ్ నుండి మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు.

 

ఈ సినిమా దక్షిణాది భాషలకు స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యహరిస్తున్నారు. ఇదిలా ఉంటే… ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ లోకి మెగాస్టర్ చిరంజీవి సైతం చేరారు. ఈ నెల 15న విడుదల కాబోతున్న తెలుగు ట్రైలర్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. దానికి సంబంధించిన చిన్నపాటి వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిరంజీవి రికార్డింగ్ థియేటర్ లోకి రాగానే ఆయనకు దర్శకుడు అయాన్ ముఖర్జీ పాదాభివందనం చేయడం విశేషం.

Exit mobile version