NTV Telugu Site icon

God Father Twitter Review: బాస్ ఈజ్ బ్యాక్.. మెగాస్టార్‌కు మరో బ్లాక్ బస్టర్

God Father

God Father

God Father Twitter Review: ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ గాడ్ ఫాదర్. మలయాళంలో లూసీఫర్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మోహనరాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరీజగన్నాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేశాయి.

Read Also: Prabhas : ఢిల్లీ ఎర్రకోటలో రావణ దహనం.. హాజరుకానున్న హీరో ప్రభాస్

ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలను ప్రదర్శించగా.. తెలుగు రాష్ట్రాలలో కూడా పలుచోట్ల గాడ్ ఫాదర్ సినిమా బెనిఫిట్ షోలు ప్రదర్శించగా ఈ మూవీతో మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అని.. ఆయన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ మూవీలో ఆన్ స్క్రీన్ హీరో చిరంజీవి అయితే.. ఆఫ్ స్క్రీన్ హీరో తమన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో తమన్ బీజీఎం అదుర్స్ అని కొనియాడుతున్నారు. వెనక్కి తగ్గిన సముద్రం సునామీలా విరుచుకుపడితే ఎలా ఉంటుందో తెలుసా అని కొందరు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. అటు యాంటీ ఫ్యాన్స్ మాత్రం మలయాళం మాతృక చూసి ఈ మూవీ చూస్తే రుచించదని ట్వీట్లు చేస్తున్నారు.

Show comments