Site icon NTV Telugu

Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’కి మైండ్ బ్లాకయ్యే నాన్-థియేట్రికల్ రైట్స్

Varun Tej 14

Varun Tej 14

Mega Prince Varun Tej’s Air Force Actioner Operation Valentine Non-Theatrical Rights For 50 Crore: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, ఇప్పటివరకు చూడని భయంకరమైన వైమానిక దాడుల, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. జాతీయ నేపథ్యం, గ్రాండ్ స్కేల్ మేకింగ్ తో ఈ సినిమా భారీ బజ్‌ను సంపాదించింది. ఇదిలావుండగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు, శాటిలైట్, డిజిటల్/స్ట్రీమింగ్, ఆడియో అన్ని భాషలకు సంబంధించిన ఇతర హక్కులతో సహా రూ. 50 కోట్ల+కి అమ్ముడుపోయాయి. వరుణ్ తేజ్‌కి ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ ప్రైస్ అని అంటున్నారు. ఇక తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ భారీ డీల్స్ వస్తున్నాయని మేకర్స్ అంటునాన్రు.

Uniform Civil Code: స్వలింగ వివాహం యూసీసీ పరిధిలోకి రాదు..!

ఈ విజువల్ గ్రాండియర్ తో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తుండగా, రాడార్ ఆఫీసర్ పాత్రను పోషించిన మానుషి చిల్లర్ తెలుగు అరంగేట్రం చేస్తున్నారు. 2022లో విడుదలైన ‘మేజర్’ భారీ విజయం తర్వాత, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మన దేశంలోని హీరోలను సెలబ్రేట్ చేసుకునే దేశభక్తి కథతో నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హుడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ సినిమా డిసెంబర్ 8, 2023న తెలుగు, హిందీలో విడుదల కానుంది.

Exit mobile version