Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’కి మైండ్ బ్లాకయ్యే నాన్-థియేట్రికల్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega Prince Varun Tej’s Air Force Actioner Operation Valentine Non-Theatrical Rights For 50 Crore: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, ఇప్పటివరకు చూడని భయంకరమైన వైమానిక దాడుల, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. జాతీయ నేపథ్యం, గ్రాండ్ స్కేల్ మేకింగ్ తో ఈ సినిమా భారీ బజ్‌ను సంపాదించింది. ఇదిలావుండగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు, శాటిలైట్, డిజిటల్/స్ట్రీమింగ్, ఆడియో అన్ని భాషలకు సంబంధించిన ఇతర హక్కులతో సహా రూ. 50 కోట్ల+కి అమ్ముడుపోయాయి. వరుణ్ తేజ్‌కి ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ ప్రైస్ అని అంటున్నారు. ఇక తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ భారీ డీల్స్ వస్తున్నాయని మేకర్స్ అంటునాన్రు.
Uniform Civil Code: స్వలింగ వివాహం యూసీసీ పరిధిలోకి రాదు..!
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఈ విజువల్ గ్రాండియర్ తో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తుండగా, రాడార్ ఆఫీసర్ పాత్రను పోషించిన మానుషి చిల్లర్ తెలుగు అరంగేట్రం చేస్తున్నారు. 2022లో విడుదలైన ‘మేజర్’ భారీ విజయం తర్వాత, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మన దేశంలోని హీరోలను సెలబ్రేట్ చేసుకునే దేశభక్తి కథతో నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హుడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ సినిమా డిసెంబర్ 8, 2023న తెలుగు, హిందీలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..