Site icon NTV Telugu

Varun Tej: గ్రాండ్ ఈవెంట్ కి మెగా ఫ్యాన్స్ రెడీ…

Varun Tej

Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న సినిమా ‘గాంఢీవధారి అర్జున’. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. టీజర్ తో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్, రీసెంట్ గా గాంఢీవధారి అర్జున ట్రైలర్ ని బయటకి వదిలారు. ముందు నుంచి యాంటిసిపేట్ చేస్తున్నట్లు ‘గాంఢీవధారి అర్జున’ ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. షార్ట్ అండ్ క్రిస్ప్ గా కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కంప్లీట్ యాక్షన్ మోడ్ లో ట్రైలర్ ని కట్ చేసిన ప్రవీణ్ సత్తారు, రెండు నిమిషాల ట్రైలర్ తోనే సినిమాలో ప్రామిసింగ్ కంటెంట్ ఉంటుందని నమ్మించాడు. వరుణ్ తేజ్ ఒక స్పైగా, కిల్లింగ్ మెషిన్ గా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. మెగా ప్రిన్స్ బాడీ లాంగ్వేజ్ కి, ఆ పర్సనాలిటీకి సరిపోయే క్యారెక్టర్ ని ప్రవీణ్ సత్తారు డిజైన్ చేసినట్లు ఉన్నాడు.

ట్రైలర్ లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్స్, స్టంట్స్ బాగున్నాయి. దీంతో ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ని అనౌన్స్ చేసారు. ఆగస్టు 21న సాయంత్రం ఆరు గంటలకి, జేఆర్సీ కన్వెన్షన్ లో గాంఢీవధారి అర్జున ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి ఏ మెగా హీరో గెస్టుగా వస్తాడో తెలియదు కానీ ఒకవేళ రామ్ చరణ్ తేజ్ వస్తే మాత్రం సినిమాపై అంచనాలు అమాంతం పెరగడం గ్యారెంటీ. ఆ అంచనాలని మ్యాచ్ చేసేలా కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు గాంఢీవధారి అర్జున సినిమాని సపోర్ట్ చేయడానికి మెగా ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. మరి నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉన్న ‘గాంఢీవధారి అర్జున’ సినిమా వరుణ్ తేజ్ కి కూడా ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి.

Exit mobile version