Game Changer: ఇండిపెండెన్స్ డే రోజైనా టీజర్ రిలీజ్ చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. మొన్నటివరకూ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి బడ్జట్ తో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి స్టూడెంట్ రోల్. ఈ స్టూడెంట్ రోల్ కి ఇంకో షేడ్ ఉన్నట్లు సమాచారం. సినిమాకి ప్రాణంగా నిలిచే ‘ఎన్నికల అధికారి’గా రామ్ చరణ్ కనిపించేది.. ఈ స్టూడెంట్ లీడర్ తర్వాత వచ్చే చేంజ్ ఓవర్ లోనే. భారి బడ్జట్ తో, శంకర్ మార్క్ సోషల్ కాజ్ టచ్ తో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది.
గేమ్ చేంజర్ క్లైమాక్స్ ని మోకోబోట్ కెమెరాలో షూట్ చేశాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ, ఆ టైములో ఇండియన్ 2 రిలీజ్ అవుతుండడంతో సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ ల్ రాజుని, ప్రొడక్షన్ హౌజ్ ని, శంకర్ ని టాగ్ చేస్తూ అసలు గేమ్ చేంజర్ సినిమా ఎంతవరకు అయ్యిందో చెప్పండి, అప్డేట్ ఇవ్వండి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ ని కూడా ట్యాగ్ చేసి అసలు ఇంకోసారి ఈ బ్యానర్ లో సినిమా చేయకు అంటూ అభిమానులు చరణ్ కి సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. గ్రాండ్ స్కేల్ లో ఒక భారీ ఈవెంట్ చేసి మరీ గేమ్ చేంజర్ టీజర్ ని ఆగస్ట్ 15న విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం. మరి ఇండిపెండెన్స్ రోజైనా గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ అవుతుందేమో చూడాలి.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!