Site icon NTV Telugu

Bro: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్ అయ్యిందా…

Bro

Bro

ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో వరుస సినిమాలు చేస్తూ ఫాన్స్ కి కూడా ఖుషి చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, బ్రో సినిమాలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్నాయి. వీటిలో లాస్ట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి అన్నింటికంటే ముందుగా ‘బ్రో’ మూవీ థియేటర్లోకి రాబోతోంది. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో’ మూవీలో సాయి ధరమ్ తేజ్ మరో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. తమిళ్ హిట్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్‌గా బ్రో తెరకెక్కింది. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ ‘బ్రో’ మూవీ పై మరింత బజ్‌ని జనరేట్ చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఏం కావాలో.. అలాంటి మాస్ స్టఫ్‌తో బ్రో సినిమా ఆడియెన్స్ ముందుకి రాబోతోందని అంటున్నారు మేకర్స్. దాంతో ఈసారి థియేటర్ టాపు లేచిపోవడం పక్కా అంటున్నారు.

జులై 28న థియేటర్స్ లో రచ్చ చేయడానికి ఫాన్స్ లో ఫుల్ జోష్ నింపాలి. ఆ పని చేయడానికే గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ ని ప్లాన్ చేస్తున్నారు. బ్రో సినిమా విడుదలకు మూడు రోజుల ముందు… గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు. జూలై 25న హైదరాబాద్, శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో మేకర్స్ నుంచి ఈవెంట్ అప్డేట్ బయటికి రానుందని సమాచారం. అయితే బ్రో ఈవెంట్‌కు పవన్ వచ్చే ఛాన్సెస్ తక్కువని ఆ మధ్య ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు పవన్ ఈ ఈవెంట్‌కు రావడం పక్కా అంటున్నారు. ఈ మధ్య పొలిటికల్ మీటింగ్స్ తప్పితే.. సినిమా ఈవెంట్లలో ఎక్కువగా కనిపించలేదు పవన్. అందుకే బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

Exit mobile version