Site icon NTV Telugu

Pavan Tej: ఘనంగా హీరోయిన్ తో మెగా వారసుడి నిశ్చితార్థం

Pavan

Pavan

Pavan Tej Konidela: మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ ప్రస్తుతం తమ తమ కెరీర్ లను బిల్డ్ చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. రామ్ చరణ్ తేజ్ నుంచి మొన్న మొన్న వచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు హీరోలుగా సెటిల్ అయిపోయారు. అయితే ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయిన వారసుడు పవన్ తేజ్ కొణిదెల. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్.. హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ఆచార్య, వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రాల్లో విలన్ గా నటించిన పవన్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఆమె ఎవరో కాదు హీరోయిన్ మేఘన. ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రంతో హీరోయిన్ గా ఆమె ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఈటీవీ లో ప్రసారమయ్యే కొన్ని షోల ద్వారా కూడా మేఘన ఫేమస్ అయ్యింది. ఇక ఈ జంట మొదటి సినిమా షూటింగ్ లోనే ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి బుధవారం నిరాడంబరంగా ఈ జంట నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ హాజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు. ఆమెతో పాటు రాజీవ్ కనకాల, సుమ కనకాల తదితరులు హాజరయ్యారు. ఇక తమ్ ఎంగేజ్ మెంట్ ఫోటోలను పవన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ” ప్రేమ అంటే ఏమిటో ఆమె వలనే తెలుసుకున్నాను. ఆమెతోనే నిశ్చితార్థం జరగడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం పవన్ తేజ్ ఒక కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version