పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అనే మాట కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా పవన్ వెళ్లకపోవడం, వెళ్లినా ఎక్కువ సేపు ఉండకపోవడం, మెగా హీరోల సినిమా ఫంక్షన్ లకి పవన్ రాకపోవడం లాంటి విషయాలు మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం ఉందనే మాటకి మరింత ఊతమిచ్చింది. ఐకమత్యంతో ఉండే మెగా అభిమానులు కాస్తా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ చిరు ఫ్యాన్స్ గా విడిపోయారు. సోషల్ మీడియాలో కూడా మెగా ఫాన్స్ గ్రూపులుగా విడిపోయి విమర్శలు చేసుకోవడం చాలా సార్లే జరిగింది. నాగబాబు అంతటి వాడు స్టేజ్ పైన నిలబడి… “పవన్ కళ్యాణ్ ని మేము పిలుస్తాం, వాడు మా ఫంక్షన్ లకి రాడు” అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సంవత్సరాలు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానుల్లో కలవకుండా దూరంగానే ఉన్నారు. చిరు, చరణ్ అనే తేడా లేకుండా ప్రతి మెగా హీరో సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు కానీ పూర్తిగా మెగా అభిమానుల్లో పవన్ ఫ్యాన్స్ ఎప్పుడూ కలిసిపోలేదు. అయితే ఎట్టకేలకు కొణిదెల కొదమసింహాల అభిమానులు కలిసినట్లు ఉన్నారు.
గత 24 గంటలుగా సోషల్ మీడియాని గమనిస్తే ఇది నిజమనిపించకమానదు. చిరు చేసిన పొలిటికల్ కామెంట్స్ సెన్సేషన్ అవ్వడం, కొంతమంది ఆంధ్రప్రదేశ్ మంత్రులు చిరుపై విమర్శలు సంధించడం ఈ మెగా కలయికకు కారణం అయ్యింది. చిరుపై విమర్శలు మొదలవ్వగానే మెగా అభిమానులు అంతా ఒక్కటయ్యారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరు ఫ్యాన్స్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. పవన్-చిరు ఫ్యాన్స్ కలిస్తే అది ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని దోస్తీ పాటలా ఉంటుంది. రెండు పవర్ ఫుల్ ఫోర్సెస్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ ఇంపాక్ట్ ని మెగా-పవర్ అభిమానులు ఇవ్వగలరు. ఆగస్టు 11న భోళా శంకర్ రిలీజ్ అవనుంది కాబట్టి మెగా అభిమానుల కలయిక ఇంపాక్ట్ ఏ రేంజులో ఉండబోతుందో చూడాలి.
