Site icon NTV Telugu

Game Changer: మెగా డైరెక్టర్ కి అభిమానుల ఝలక్…

Ram Charan

Ram Charan

ఆర్ఆర్ఆర్ తర్వాత పవర్ ఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అనౌన్స్ చేయగానే ఎగిరి గంతేసిన మెగాభిమానులు… ఇప్పుడు శంకర్‌ పై మండి పడుతున్నారు. అసలు శంకర్ ఏం చేస్తున్నాడు? గేమ్ చేంజర్ అప్డేట్ ఏంటి? అనేది అర్థం కాకుండా ఉంది. నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో సమయం వచ్చినప్పుడల్లా గేమ్ చేంజర్ పై నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నిన్నటికి నిన్న ఎప్పుడొస్తుందో అనుకున్న పవర్ స్టార్ ఓజి రిలీజ్ డేట్ బయటికి రావడంతో… చరణ్ ఫ్యాన్స్‌కు మరింత మండిపోయింది. దిల్‌ రాజు సెప్టెంబర్‌లో గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ ఉందని ఆ మధ్య చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు రిలీజ్ డేట్ అంటూ సెప్టెంబర్ 27ని లాక్ చేసారు ఓజి మేకర్స్. దీంతో మెగా ఫ్యాన్స్ OG నుంచి దృష్టిని ‘గేమ్‌ ఛేంజర్‌’పైకి షిఫ్ట్ చేసి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అంటూ శంకర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. అసలు సినిమా రిలీజ్‌ చేసే ఆలోచన ఉందా? రెక్‌లెస్ ఫిల్మ్ మేకర్ అంటూ… శంకర్‌ పై నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు. వాస్తవానికి గేమ్ చేంజర్ నుండి ఫస్ట్ సాంగ్ ‘జరగండి’, గతేడాది దీపావళికి రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేశారు. అప్పటి నుంచి గేమ్ చేంజర్ నుంచి మరో అప్డేట్ బయటికి రాలేదు. సినిమా మొదలై ఏళ్లు గడుస్తున్నా… ఇప్పటివరకు కేవలం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ ఇవ్వలేదని, ఇకనైనా మేకర్స్ మేల్కోవాలని చరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్లో నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా దిల్ రాజు, శంకర్ స్పందిస్తారేమో చూడాలి.

Exit mobile version