NTV Telugu Site icon

Varun Tej: మెగాఫ్యాన్స్ ఫోకస్ అంతా ఆపరేషన్‌ వాలెంటైన్‌ మీదే

Operation Valentine Trailer

Operation Valentine Trailer

Mega Fans Focus on Operation Valentine: మెగా హీరోల్లో ఒక్కడే ఫామ్‌లో వున్నాడు. రెండేళ్ల క్రితం పుష్పతో హిట్‌ కొట్టిన అల్లు అర్జున్‌ తప్ప మరో హీరో లేడు. అదేమిటో మెగా హీరోలను ఫ్లాపులు వెంటాడుతున్నాయి. ఫెయిల్యూర్స్‌లో ఉన్న మెగా ఫ్యామిలీని వరుణ్‌తేజ్‌ గాడిలో పెడతాడా? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. చిరంజీవి కెరీర్‌లో ఆచార్యనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌ అనుకుంటే.. భోళా శంకర్‌ అంతకు మించి నష్టాలు తీసుకొచ్చింది. భోళా తర్వాత నటిస్తున్న విశ్వంభర’ను చూడాలంటే.. 2025 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. బింబిసార ఫేం వశిష్ట డైరెక్షన్‌లో నటిస్తున్నఈ మూవీ మెగా బడ్జెట్‌ 200 కోట్లతో రూపొందుతోంది. ఇక పవన్‌ విషయానికి వస్తే ఆయన లాస్ట్‌ మూవీ బ్రో వీకెండ్‌ కలెక్షన్స్‌కే పరిమితమైంది. ఆశించిన మేర కలెక్షన్స్ అయితే రాలేదు. ఇక పవర్‌స్టార్‌ చేతిలో మూడు సినిమాలున్నా ముందు వాచ్చే OG రిలీజ్‌ డేట్‌ సెప్టెంబర్‌ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. మరోపక్క ఆర్‌ఆర్‌ఆర్‌తో రామ్‌చరణ్‌ కాస్తా గ్లోబల్‌ స్టార్‌ అయ్యాడు. శంకర్‌ చేతిలో పడ్డాడు ఇంకేముందనుకుంటే.. ఈలోగా వచ్చిన ఆచార్య ఈ మెగా హీరోను డిజప్పాయింట్‌ చేసింది.

Nani 32: సుజిత్ తో నాని నెక్స్ట్ సినిమా.. రిలీజ్ అప్పుడేనట

చెర్రీ సక్సెస్‌ చూడాలంటే.. ‘గేమ్‌ ఛేంజర్‌’ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అది ఎప్పుడు వస్తుందో నిర్మాత దిల్‌ రాజు కూడా చెప్పలేకపోతున్నాడు. ఇక అలాగే మెగా మేనల్లుళ్లు సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ కూడా ఫామ్‌లో లేరు. విరూపాక్ష హిట్‌ అయిందనుకుంటే బ్రో నిరాశపరిచింది. వైష్ణవ్‌ తేజ్‌ ఆదికేశవ్‌తో ప్లాప్‌ కంటిన్యూ చేశాడు. సాయిధరమ్‌తేజ్‌ నటించాల్సిన గాంజా శంకర్‌ క్యాన్సిల్‌ అయింది. ఇప్పట్లో మెగా మేనల్లుళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక అలాగే గద్దలకొండ గణేశ్‌ తర్వాత వరుణ్‌ తేజ్‌ సరైన సక్సెస్‌ చూడలేకపోయాడు. లాస్ట్ మూవీ గాండీవధార అర్జున అయితే భారీగా నిరాశ పర్చింది. ఇక మార్చి1న ‘ఆపరేషన్‌ వాలెంటేన్‌”తో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. చిరంజీవి.. పవన్‌.. రామ్‌చరణ్‌.. మెగా మేనల్లుళ్లు ఇప్పట్లో కనిపించకపోవడంతో.. మెగా ఫ్యామిలీ సక్సెస్‌ భారం వరుణ్‌తేజ్‌ ఆపరేషన్‌ వాలెంటైన్‌పై పడింది. అయినా హిట్లు ప్లాప్ లు తమకు లెక్కలేదని, ఒక ఏడాది ఉంటాయి మరో ఏడాది ఉండవు. అలాంటి వాటి గురించి ఆలోచించలేమని వరుణ్ అంటున్నాడు.