Site icon NTV Telugu

Megastar: వింటేజ్ బాస్ ని గుర్తు చేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’

Gang Leader

Gang Leader

లవ్, ఫైట్స్, ఫ్రెండ్షిప్, బ్రదర్ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, సూపర్ సాంగ్స్, గూస్ బంప్స్ తెచ్చే ఎలివేషన్స్… ఇలా మనిషిని కదిలించే అన్ని ఎమోషన్స్ ఒకే సినిమాలో ఉంటే ‘గ్యాంగ్ లీడర్’ అవుతుంది. ఇందులో ఫైట్స్, లవ్, ఎమోషన్, సాంగ్స్, అన్ని పర్ఫెక్ట్ గా బాలన్స్ అయ్యి ఉంటాయి. 1991లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పైన నిర్మించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రాపర్ కమర్షియల్ సినిమా అనే పదానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉంటుంది. బిప్పి లహరి ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. విజయశాంతి, చిరుల లవ్ ట్రాక్… మురళి మోహన్-శరత్ కుమార్-చిరంజీవిల మధ్య బ్రదర్ ఎమోషన్ గ్యాంగ్ లీడర్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఈ మూవీలో రావు గోపాల్ రావ్ ప్లే చేసిన నెగటివ్ రోల్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

అప్పట్లో 100 రోజులు 50 కేంద్రాల్లో ఆడిన గ్యాంగ్ లీడర్ మూవీ 100 డేస్ వేడుక జరిగిన సమయంలో తీసిన క్రౌడ్ విజువల్స్ ని “అప్పుల అప్పారావు” సినిమాలో వాడుకున్నారు అంటే ఎంత మంది జనాలు 100 డేస్ ఫంక్షన్ కి వచ్చారో ఊహించొచ్చు. చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి 45 ఏళ్లు అయిన సంధర్భంగా, చిరుని సెలబ్రేట్ చేసుకోవడానికి మెగా ఫాన్స్ గ్యాంగ్ లీడర్ స్పెషల్ షో ప్లాన్ చేశారు. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమాని రీరిలీజ్ చేశారు. ఫిబ్రవరి 11న గ్యాంగ్ లీడర్ రీరిలీజ్ కావాల్సి ఉండగా, వాయిదా పడి మార్చ్ 4న 4K వర్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది. గ్యాంగ్ లీడర్ సినిమాని ఆల్రెడీ థియేటర్స్ లో చూసిన వాళ్లు, ఆ మ్యాజిక్ ని మరోసారి విట్నెస్ చెయ్యడానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయిన ఈ జనరేషన్ ఆడియన్స్… అసలు వింటేజ్ మెగాస్టార్ అనే వాడు ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి గ్యాంగ్ లీడర్ సినిమాని 4Kలో చూస్తున్నారు. అప్పటి ఆడియన్స్ అయినా ఇప్పటి మోడరన్ ఆడియన్స్ అయినా గ్యాంగ్ లీడర్ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకి వచ్చి చెప్తున్న మాట మాత్రం ఒకటే… “వింటేజ్ మెగాస్టార్ ఈ రేంజులో ఉంటాడా? ఆయన స్వాగ్ ఇలా ఉంటుందా? ఇది కదా మాస్ సినిమా అంటే” ఇలా కామెంట్స్ చేస్తూ ఫాన్స్ అందరూ గ్యాంగ్ లీడర్ సినిమా చూసి విజిల్స్ వేస్తున్నారు.

Exit mobile version