మెగాస్టార్ చిరంజీవి ఇంట పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ సంతోషకరమైన వార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మెగా కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘడియలు రానే వచ్చాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఉపాసన ఒక బాబుకి, ఒక పాపకి జన్మనివ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనవడు, మనవరాలు ఇద్దరూ ఒకేసారి తమ జీవితాల్లోకి రావడం పట్ల చిరంజీవి మరియు సురేఖ గారు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భాన్ని “దైవిక ఆశీర్వాదం” (Divine Blessing) గా ఆయన అభివర్ణించారు. కొణిదెల కుటుంబంలో ఈ కొత్త వెలుగులు నిండటం పట్ల తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
Also Read : Anil Ravipudi : రావిపూడికి సురేష్ బాబు టెన్షన్.. ‘ఫ్రీడమ్’ దొరుకుద్దా?
ప్రస్తుతం తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు బిడ్డలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. చిరంజీవి “తాతయ్యగా మాకు ఇది అత్యంత సంతోషకరమైన సమయం. మా కుటుంబంలోకి ఈ చిన్నారులను ఆహ్వానించడం ఒక అద్భుతమైన అనుభూతి. మాపై ప్రేమను కురిపిస్తూ, ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.” అని ఆయన అన్నారు. మెగా వారసులు రావడంతో సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “చిన్న మెగాస్టార్”, “లిటిల్ మెగా ప్రిన్సెస్” అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
