Site icon NTV Telugu

Mega158 : చిరంజీవి – కొల్లి బాబీ సినిమాలోకి టాప్ టెక్నీషియన్ జాయిన్..

Mega 158

Mega 158

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “మెగా 158” సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు కేఎస్‌ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి టాప్ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవిని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

Also Read: SSMB29: రాజమౌళి – మహేశ్ బాబు మూవీ.. నా జీవితాని కచ్చితంగా మార్చేస్తుంది..

లక్కీ భాస్కర్‌, కింగ్ ఆఫ్‌ కోత్త, లోకా వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరా వర్క్ అందించిన నిమిష్ రవి ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో జాయిన్ కావడం సూపర్‌ సర్‌ప్రైజ్‌గా మారింది. నేడు నిమిష్ రవి పుట్టినరోజు సందర్భంగా “మెగా 158” టీమ్‌ తరపున కేవీఎన్ ప్రొడక్షన్స్‌ మరియు దర్శకుడు బాబీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ సినిమా చుట్టూ క్రేజ్‌ మరింత పెరిగింది. ఇక చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో ఇది మరో పవర్‌ప్యాక్డ్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకోనుందని అభిమానులు నమ్ముతున్నారు.

Exit mobile version