Mega 156: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా 156 తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బింబిసార సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కబోతుందని దర్శకుడు ముందే చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పంచభూతాలను కలుపుతూ సాగే ఒక ముల్లోక వీరుడు కథగా మెగా 156 సినిమాను వశిష్ట తెరకెక్కిస్తున్నాడట. ఇక ఎప్పటినుంచో ఈ చిత్రానికి ముల్లోకవీరుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ సినిమాకు ఆ టైటిల్ కాకుండా వేరే టైటిల్ ని అనుకున్నట్లు తెలిసిపోయింది.
Manchu Mohan Babu: విష్ణుకు ప్రమాదం.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు
తాజాగా ఈ సినిమా టైటిల్ లీక్ అయ్యింది. ఒక స్క్రిప్ట్ పేపర్ కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. యూవీ క్రియేషన్స్ పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్ మొదటి పేజీ.. అందులో విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు రాసి ఉంది. దీంతో విశ్వంభర అనే టైటిల్ ని మెగా 156 కు పెట్టనున్నారని అభిమానులు చెప్పకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. చిరు ప్రస్తుతం ఇటలీలో వరుణ్ పెళ్లిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పెళ్లి నుంచి రాగానే నవంబర్ 5న రిసెప్షన్ పనులను పూర్తి చేసి.. చిరు విశ్వంభరా సెట్లో అడుగుపెట్టనున్నాడు. టైటిల్ ము బట్టి పవర్ఫుల్ కథగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
#MegastarChiranjeevi #Viswambhara @KChiruTweets pic.twitter.com/XPiGXw56jX
— Team Chiru Vijayawada (@SuryaKonidela) November 1, 2023