Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్‌గా యశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఈ సినిమా నుండి ‘లేడీస్ & లేడీస్’ పేరుతో విడుదలైన స్పెషల్ గ్లిమ్స్ నెట్టింట విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ డార్క్, స్టైలిష్ మరియు డేంజరస్ ప్రపంచాన్ని శాసించబోయే శక్తివంతమైన మహిళా శక్తులను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ బోల్డ్ వీడియోను వదిలారు. పవర్, మిస్టరీ, అటిట్యూడ్, అడ్రినలిన్ రష్‌తో నిండిన ఈ గ్లిమ్స్.. సినిమాలో లేడీస్ పాత్రలు ఎంత ఊరమాస్ రేంజ్లో ఉండబోతున్నాయో స్పష్టం చేసింది.
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
ఈ క్రేజీ వీడియోలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ మరియు హ్యూమా ఖురేషి వంటి టాప్ హీరోయిన్లు తమ అల్ట్రా స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మైండ్ బ్లాక్ చేశారు. నయనతార అత్యంత పవర్ఫుల్ అండ్ ఫియర్స్ లుక్‌లో కనిపించగా.. కియారా అద్వానీ విభిన్నమైన, మ్యాగ్నెటిక్ ఎనర్జీతో మెప్పించింది. తారా సుతారియా చలాకీగా, రుక్మిణి వసంత్ తీవ్రమైన ఇంటెన్సిటీతో, హ్యూమా ఖురేషి నెరజాణ తరహా గ్లింప్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాత్రల వెనుక ఒక మహిళా వాయిస్ ఓవర్ ద్వారా వచ్చే పవర్ఫుల్, రెబలియన్ డైలాగ్స్ ఈ వీడియోను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. పిల్లలు.. దూరంగా ఉండండి. తల్లిదండ్రులు.. మీ పిల్లలను దూరంగా ఉంచండి. నానమ్మ, తాతమ్మలు.. మీ పిల్లల పిల్లలు దూరంగా ఉండేలా చూసుకోండి. ఇక ముత్తాతలు.. మీ స్వంత రిస్క్‌పైనే చూడండి” అంటూ ఇచ్చిన క్యాప్షన్ సినిమా ఏ రేంజ్ రా కంటెంట్‌తో రాబోతుందో హింట్ ఇచ్చింది. గీతూ మోహన్ దాస్ మార్క్ విజువల్స్, స్టైలైజ్డ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంట్రిగ్యూయింగ్ అట్మాస్ఫియర్ సినిమాపై అంచనాలను పెంచాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా డబ్ చేసి ఈ ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!