Deepthi Ghanta: సోనీ లివ్ లో నాని సోదరి ఆంథాలజీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naani: హీరో నాని కేవలం నటనకే పరిమితం కాకుండా అప్పుడప్పుడూ చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామి అవుతున్నాడు. అప్పుడెప్పుడో ‘డి ఫర్ దోపిడి’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన నాని… ఆ తర్వాత తీసిన ‘అ’ జాతీయ స్థాయిలోనూ అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత అతను నిర్మించిన ‘హిట్’ చిత్రం కూడా కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు దీనికి ఫ్రాంచైజ్ గా తీస్తున్న ‘హిట్ 2’ డిసెంబర్ 2న జనం ముందుకు వస్తోంది. విశేషం ఏమంటే… నాని ప్రముఖ దర్శకులు బాపు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. అయితే… నటుడిగా బిజీ కావడంతో నాని మెగా ఫోన్ చేతిలోకి తీసుకోలేదు కానీ అతని సోదరి దీప్తి గంటా మాత్రం దర్శకురాలైపోయింది. ‘మీట్ క్యూట్’ పేరుతో ఆమె ఓ ఆంథాలజీని రూపొందించింది. దీన్ని నాని, ప్రశాంతి తిపుర్నేని నిర్మించారు.
ఐదు కథలతో సాగే ఈ ఆంథాలజీలో సత్యరాజ్ కీలక పాత్రను పోషించారు. రోహిణి మొల్లేటి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచ ఫీమేల్ లీడ్స్ గా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా కథానాయకులుగా నటించారు. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ సోనీ లివ్ ఈ ఆంథాలజీ హక్కులను పొందింది. త్వరలో ప్రత్యేకంగా ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో స్క్రీనింగ్ చేయనుంది. ఓ క్యూట్ పోస్టర్ ద్వారా మేకర్స్ అదే విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నారు. ‘మీట్ క్యూట్’ ఆంథాలజీ అంతా అందమైన యాదృచ్ఛిక సంఘటనలు, గొప్ప సంభాషణలు, హార్ట్ వార్మింగ్ క్షణాల సమాహారంగా ఉంటుందని దర్శకురాలి దీప్తి తెలిపారు. దీనికి వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, విజయ్ బుల్గానిన్ సంగీత సమకూర్చారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
Also Read
- Samantha Ruth Prabhu : 'మా ఇంటి బంగారం' హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
- Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్... ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
- Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
- Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ 'పార్వేట'
తాజావార్తలు
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!