NTV Telugu Site icon

Deepthi Ghanta: సోనీ లివ్ లో నాని సోదరి ఆంథాలజీ!

Naani

Naani

Naani: హీరో నాని కేవలం నటనకే పరిమితం కాకుండా అప్పుడప్పుడూ చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామి అవుతున్నాడు. అప్పుడెప్పుడో ‘డి ఫర్ దోపిడి’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన నాని… ఆ తర్వాత తీసిన ‘అ’ జాతీయ స్థాయిలోనూ అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత అతను నిర్మించిన ‘హిట్’ చిత్రం కూడా కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు దీనికి ఫ్రాంచైజ్ గా తీస్తున్న ‘హిట్ 2’ డిసెంబర్ 2న జనం ముందుకు వస్తోంది. విశేషం ఏమంటే… నాని ప్రముఖ దర్శకులు బాపు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. అయితే… నటుడిగా బిజీ కావడంతో నాని మెగా ఫోన్ చేతిలోకి తీసుకోలేదు కానీ అతని సోదరి దీప్తి గంటా మాత్రం దర్శకురాలైపోయింది. ‘మీట్ క్యూట్’ పేరుతో ఆమె ఓ ఆంథాలజీని రూపొందించింది. దీన్ని నాని, ప్రశాంతి తిపుర్నేని నిర్మించారు.

ఐదు కథలతో సాగే ఈ ఆంథాలజీలో సత్యరాజ్ కీలక పాత్రను పోషించారు. రోహిణి మొల్లేటి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచ ఫీమేల్ లీడ్స్ గా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా కథానాయకులుగా నటించారు. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ సోనీ లివ్ ఈ ఆంథాలజీ హక్కులను పొందింది. త్వరలో ప్రత్యేకంగా ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో స్క్రీనింగ్ చేయనుంది. ఓ క్యూట్ పోస్టర్ ద్వారా మేకర్స్ అదే విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నారు. ‘మీట్ క్యూట్’ ఆంథాలజీ అంతా అందమైన యాదృచ్ఛిక సంఘటనలు, గొప్ప సంభాషణలు, హార్ట్ వార్మింగ్ క్షణాల సమాహారంగా ఉంటుందని దర్శకురాలి దీప్తి తెలిపారు. దీనికి వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, విజయ్ బుల్గానిన్ సంగీత సమకూర్చారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Show comments