Site icon NTV Telugu

Meera Jasmine : మాస్ డైరెక్టర్ ఆఫర్… అందుకేనా ఈ అందాల ఆరబోత

Meera-Jasmine

జాతీయ అవార్డు గ్రహీత, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో భాగమైన మీరా జాస్మిన్ త్వరలో రీఎంట్రీకి సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా మీరా జాస్మిన్ సన్నగా మల్లె తీగలా మారిన ఫోటోలు, ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత రీఎంట్రికి సిద్ధమైన ఈ హీరోయిన్ ఇప్పుడు తన వైల్డ్ సైడ్‌ను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది. తన కెరీర్ మొత్తంలో తాను క్లిక్ చేసిన కొన్ని హాటెస్ట్, గ్లామరస్ చిత్రాలను షేర్ చేస్తూ, గొప్ప సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ఈ బ్యూటీ గ్లామ్ డాల్‌గా మెరుస్తోంది. అయితే ఆమె అందానికి ఫిదా అయిన ఓ మాస్ డైరెక్టర్ ఆమె అందానికి ఫిదా అయ్యి, మంచి అవకాశం ఇచ్చినట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Aadavallu Meeku Johaarlu : సెల్ఫీతో అప్డేట్ ఇచ్చిన శర్వా, రష్మిక

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రారంభించాలని ఎదురు చూస్తున్నాడు. యంగ్ హీరో రామ్ పోతినేనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ విషయమై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దర్శకుడు బోయపాటి ఆమె స్పైసీ లుక్స్‌కి ఆకర్షితుడయ్యాడని, తన తదుపరి చిత్రంలో ఆమెను నటింపజేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఇకబ్ బోయపాటి మొదటి చిత్రం “భద్ర”లో హీరోయిన్ మీరా జాస్మిన్ అన్న విషయం తెలిసిందే. మరి ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

Exit mobile version