NTV Telugu Site icon

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మిస్ ఇండియా…

meenakshi-chaudhary

meenakshi-chaudhary

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు ఫెమినా మిస్ ఇండియా 2018, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 ఫస్ట్ రన్నరప్ సినీ నటి మీనాక్షి చౌదరి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటి మీనాక్షి చౌదరి.

ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్బుతమని కొనియాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయి మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతొష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు మీనాక్షి చౌదరి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా సినీ నటి అక్షర హసన్, నటులు సిద్దార్థ శంకర్, విజయ్ ఆంటోనీ ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు మీనాక్షి చౌదరి. కార్యక్రమ అనంతరం మీనాక్షి చౌదరికి వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ.