NTV Telugu Site icon

Meena: నరసింహాలో నీలాంబరి పాత్రకు ముందు నన్నే అనుకున్నారు.. కానీ, మా అమ్మ..

Meena

Meena

Meena: సీనియర్ నటి మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే నాగేశ్వరరావు తో పాటు ధీటుగా నటించి మెప్పించడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. అలా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సాగర్ ను వివాహమాడి సినిమాలకు కొన్నేళ్లు బ్రేక్ ఇచ్చింది. మీనా కు ఒక పాప. తనలానే తన కూతురును కూడా బాలనటిగా మార్చింది. ఇక గతేడాది మీనా జీవితంలో మర్చిపోలేని విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఆమె భర్త సాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక భర్త చనిపోయాక ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటన్నింటిని తట్టుకొని.. కూతురు కోసం మళ్ళీ నటించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఒక షో కు జడ్జిగా వ్యవహరిస్తున్న మీనా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇక ఈ ఇంటర్వ్యూలో ఆమె ఎన్ని హిట్ సినిమాలను వదులుకుంది చెప్పుకొచ్చింది. “తెలుగులో నేను మిస్ చేసి బాధపడిన సినిమా నిన్నే పెళ్లాడతా.. వంశీ.. నువ్వే చేయాలి.. నువ్వే చేయాలి అని అడిగాడు. కానీ, 60- 65 డేస్ అడిగారు. అప్పుడు 25 డేస్ లో అయిపోయే సినిమాకు 60 డేస్ అడుగుతున్నారే.. ఎలా ఇచ్చింది. నేను ఇంకో సినిమాకు ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నాను. అక్కడ కమిట్ అవ్వకపోతే 60 డేస్ కన్నా ఎక్కువ ఇచ్చేదాన్ని. కమిట్ అయిన సినిమా నుంచి.. ఇక్కడకు అక్కడకు తిరగలేను. 15 డేస్ అయితే ఇవ్వొచ్చు.. తరువాత ఏంటి పరిస్థితి. ఒప్పుకున్నాకా చేయకపోతే అది వేరేలా ఉంటుంది. అందుకే నేను ఆ సినిమా ఒప్పుకోలేదు. ఇక ఇది కాకుండా నరసింహాలో రమ్యకృష్ణ నీలాంబరి రోల్ కు నన్ను అడిగారు. కానీ, మా అమ్మ నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని చెప్పారు. ఆ సమయంలో నేను చాలా హోమ్లీ పాత్రలు చేస్తున్నాను. అది కాకుండా అప్పటికే రజినీకాంత్ గారితో నేను చాలా సినిమాలు చేశాను. అప్పట్లో తమినాడులో మా ఇద్దరిది మంచి పెయిర్ అని పేరు ఉంది. ఆ టైమ్ ఈ క్యారెక్టర్ సరికాదు.. అని అమ్మ చెప్పారు. కానీ, నాకు ఆ పాత్ర చేయాలనీ ఉండేది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆ తరువాత సౌందర్య క్యారెక్టర్ చేస్తారా ..అని అడిగితే.. చేస్తే రమ్యకృష్ణ పాత్రనే చేస్తా.. లేకపోతే చేయను అని చెప్పా.. అలా ఆ క్యారెక్టర్ మిస్ అయ్యింది. నేను మిస్ అయ్యాను అని కాదు కానీ, నాకన్నా రమ్యకృష్ణ ఎంతో బాగా చేసింది” అని చెప్పుకొచ్చింది.