Little Hearts : ఈ మధ్య భారీ బడ్జెట్, పాన్ ఇండియా ప్రాజెక్టులు అంటూ వచ్చిన చాలా సినిమాలో బొక్క బోర్లా పడుతున్నాయి. భారీ యాక్షన్ సీన్లు, వీఎఫ్ ఎక్స్ కూడా సినిమాలను గట్టెక్కించట్లేదు. కానీ చిన్న బడ్జెట్ తో వచ్చిన మంచి కంటెంట్ ఉండే సినిమాలను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మౌళి తనూజ్ నటించిన లిటిల్ హార్ట్స్ భారీ హిట్ అయింది. చాలా చోట్ల ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మౌళి మాట్లాడుతూ.. మా సినిమాను ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదు. ప్రేక్షకులు నిజంగా పిచ్చోళ్లా మీరు.. సినిమా నచ్చితే ఇంతలా ఆదరిస్తారా అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Read Also : Ram Charan : అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్.. ఆ బిజినెస్ లోకి అడుగు..?
ఈ సినిమాకు మొదటి రోజు రూ.2.5 కోట్లు వచ్చాయి. అది మా మూవీ బడ్జెట్ కంటే చాలా ఎక్కువే. ఇప్పటికీ చా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. నిజంగా ఇంత ప్రేమ చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఈ వారం రోజుల్లో ఎన్ని సార్లు ఏడ్చానో నాకే తెలియదు. మా టీమ్ ఇంకా షాక్ లోనే ఉంది. మేం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఇంతలా ఆదరిస్తుంటే నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. ప్రేక్షకులకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది అంటూ తెలిపాడు మౌళి. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా.. శివానీ నగరం హీరోయిన్ గా చేసింది. కామెడీ సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టింది.
Read Also : Shivani Nagaram : శివానీ నగరం దెబ్బ.. ఆ ముగ్గురు భామలకు చెమటలు
