Vikram: ‘మత్తుగా మత్తుగా’.. కమల్ ఊర మాస్ డాన్స్ తో చిత్తు చేసాడుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా మొదటి లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘మత్తుగా మత్తుగా’ అంటూ సాగిన ఈ సాంగ్ ప్రేక్షకులను మాస్ స్టెప్పులు వేయిస్తోంది. స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఈ పాట ని మాస్, గ్రూవీ సాంగ్ గా డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్ లో ఫ్యాన్స్ తో విజల్స్ వేయించేలా వుంది. ఈ పాటలో కమల్ హాసన్ డ్యాన్స్ మూవ్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి.
ముఖ్యంగా తలపై షర్టు కప్పుకొని కమల్ హాసన్ చేసిన మాస్ డ్యాన్స్ ప్రేక్షకులని అలరిస్తుంది. కమల్ హాసన్ ఈ పాటని స్వయంగా పాడటం మరో ప్రత్యేకత. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సాంగ్ ను కమల్ పాడడం, వోకల్స్ ఆయనే స్వయంగా రాయడం. దీంతో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. కమల్ చాలా రోజుల తరువాత తనదైన మార్కు స్వరంతో ఊరమాస్ స్టెప్పులతో ఈ పాటని ఓ రేంజ్ లో అదరగొట్టారని చెప్పొచ్చు. ఇక స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది. జూన్ 3న ‘విక్రమ్’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమౌతుంది. మరి ఈ చిత్రంతో విశ్వనటుడు భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
Also Read
- Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
- Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్' సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
- Hero - Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
- Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
తాజావార్తలు
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?