RRR Dubai Press Meet తాజాగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ ను చూసి మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఓ వీడియోను విడుదల చేస్తూ “మా దుబాయ్ అభిమానుల నుండి ఎంతటి ఘన స్వాగతం! మేము భారతదేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది… మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము” అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మన హీరోలు చెర్రీ, తారక్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తుండగా, అభిమానులు చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. ఇక ఈ వేడుకకు వచ్చిన జనాలను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు ఆ ఈవెంట్ కు పోటెత్తారు. సమన స్టార్స్ కు విదేశాల్లో ఇంతటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం విశేషమనే చెప్పాలి. అయితే ఈ క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుంది.
Read Also : AK62 : నయన్ బాయ్ ఫ్రెండ్ తో అజిత్ నెక్స్ట్ మూవీ
ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోలలో రాజమౌళి ముందుంటారు. ఇక ఆయన పర్ఫెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళితో సినిమా అంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది హీరోలకు. ‘బాహుబలి’ విషయంలో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’తో ప్రభాస్ లాగే ‘ఆర్ఆర్ఆర్’ చరణ్, తారక్ కూడా వరల్డ్ వైడ్ గా మరింత పాపులర్ అవుతున్నారు. ఇక మార్చ్ 20 నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీం నిర్వహించనున్న పలు ఈవెంట్లకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
What a Massive Welcome by our #Dubai fans! Feels like we are in India… Love you so much ❤️ #RRRinDubai #RRRMovie pic.twitter.com/QqSKNr2Jnu
— RRR Movie (@RRRMovie) March 18, 2022
