Site icon NTV Telugu

Kamal Haasan : తెలుగులో భారీ ఎత్తున థగ్ లైఫ్ ప్రమోషన్స్

Thuglife

Thuglife

ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో  ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది టీమ్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు మూవీ టీం ఇప్పుడు ప్రొమోషన్‌లకు స్పెషల్ ప్లాన్ రెడీ చేసింది.

Also Read : Bollywood : బజ్జి బయోపిక్.. హీరో ఎవరంటే.?

అందులో భాగంగా మే 17న థగ్ లైఫ్ ట్రైలర్ విడుదల కానుంది. మే 24న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ జరగనుంది. మే 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. అంతకు ముందు, చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. తెలుగులో కమల్ హాసన్ కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆడియన్స్ అందరినీ కలవాలని కమలహాసన్ ఈ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ కి తెలుగులో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ భారీగా విడుదల చేస్తున్నారు. మల్టీ స్టేట్స్ ప్రొమోషన్‌లతో ‘థగ్ లైఫ్’ ని ట్రూ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిపేందుకు టీమ్ కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా కృషి చేస్తోంది.

Exit mobile version