Site icon NTV Telugu

Raviteja: ‘టైగర్’ వేటకి టైమ్ షురూ అయ్యింది…

Tiger Nageshwar Rao

Tiger Nageshwar Rao

వచ్చే దసరాకు బాక్సాఫీస్ దగ్గర వేట మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. అంతకంటే ముందే టీజర్‌తో డిజిటల్ వేటకు వచ్చేస్తున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన రవితేజ… త్వరలోనే ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వర రావు సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్న మేకర్స్… ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచే పనిలో ఉన్నారు. ఇప్పటికే టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఐదు భాషల్లో… ఐదుగురు స్టార్ హీరోలు రివీల్ చేయడమే కాకుండా ఫస్ట్ గ్లింప్స్ కు వాయిస్ కూడా అందించి, ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చారు.

‘జింకలను వేటాడిన పులిని చూసి ఉంటావ్. పులులను వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా..? అని రవితేజ పవర్ ఫుల్ వాయిస్ తో చెప్పే డైలాగ్ గ్లిమ్ప్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. అయితే గ్లిమ్ప్స్ కే ఇలా ఉంటే.. ఇక టీజర్ బయటకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. మోస్ట్ అవైటెడ్ టీజర్ టైగర్ నాగేశ్వరరావు టీజర్‌ని ఆగష్టు 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. టైగర్ దండయాత్ర పేరుతో ఈ టీజర్‌ బయటికి రానుంది. ప్రస్తుతం మాస్ రాజా ఫ్యాన్స్ అంతా టైగర్ రోర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version