మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో రవితేజ ముందెన్నడూ లేనంత జోష్ చూపిస్తున్నాడు. అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తూ ‘ధమాకా’ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తున్న రవితేజ, తన డైరెక్టర్ ‘ట్రియో’ని రంగంలోకి దించాడు. ఈమధ్య కాలంలో తనకి సూపర్ హిట్స్ ఇచ్చిన ‘గోపీచంద్ మలినేని’, ‘బాబీ’, ‘అనీల్ రావిపూడి’లతో రవితేజ ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశాడు. రవితేజకి ‘క్రాక్’, ‘రాజా ది గ్రేట్’, ‘పవర్’ లాంటి హిట్ సినిమాలని ఇచ్చిన ఈ ముగ్గరు దర్శకులు ధమాకా సినిమాని ప్రమోట్ చేస్తూ ఈ ఇంటర్వ్యూ చేశారు. హై ఎనర్జిటిక్ ఇంటర్వ్యూని రేపు రిలీజ్ చేస్తున్నట్లు రవితేజ ట్వీట్ చేశాడు.
My blockbuster directors Trio @MeGopiChand, @DirBobby & @AnilRavipudi came together for the first time to interview me!
It was a Dhamakedar interaction about #Dhamaka🤗
Full Interview out tomorrow ✌️#DhamakaFromDec23 pic.twitter.com/xOEQn3aVgD— Ravi Teja (@RaviTeja_offl) December 20, 2022
సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే రవితేజ, ప్రమోషన్స్ విషయంలో కాస్త బ్యాక్ స్టెప్ వేస్తుంటాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ అండ్ కొన్ని కామన్ ఇంటర్వ్యూస్ లో తప్ప రవితేజ బయట ఎక్కువ మాట్లాడాడు. అలాంటిది ‘ధమాకా’ సినిమాని మాత్రం రవితేజ చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. దర్శకుడు త్రినాథరావు నక్కిన, రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కూడా ‘ధమాకా’ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకోని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘ధమాకా’ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి కాబట్టి ఆడియన్స్ లో ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఈ బజ్ ని డిసెంబర్ 23 వరకూ అలానే కంటిన్యు చేస్తే ‘ధమాకా’ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది.
