Rules Ranjan: మాస్ మహారాజా లాంచ్ చేసిన ‘రూల్స్ రంజన్’ ‘దేఖో ముంబై’ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. నాలో నేనే లేను, సమ్మోహనుడా, ఎందుకురా బాబు పాటలు ఒక దానిని మించి ఒకటి ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి నాలుగో పాటను విడుదల చేశారు మేకర్స్.
‘రూల్స్ రంజన్’ నుంచి ‘దేఖో ముంబై’ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియో మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా ఈరోజు(సెప్టెంబర్ 19) ఉదయం 10:20 గంటలకు విడుదలైంది. విడుదల సందర్భంగా పాట బాగుందని చిత్ర బృందాన్ని ప్రశంసించిన రవితేజ, చిత్రం ఘన విజయం సాధించాలని ఆకంక్షించారు. ముంబై నగరాన్ని పరిచయం చేస్తూ సాగిన ఈ పాట బాగా ఎనర్జిటిక్ గా ఉంది. అమ్రిష్ గణేష్ అందించిన సంగీతం ఎవరి చేతనైనా కాలు కదిపించేలా ఉంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్, మేఘ్-ఉ-వాట్ సాహిత్యం అందించారు. “దేఖో ముంబై దోస్తీ మజా.. పీకే కర్ లో మస్తీ మజా..” అంటూ తెలుగు, హిందీ పదాలతో పాటను అల్లిన తీరు అమితంగా ఆకట్టుకుంది. “నువ్ పక్కనుంటే చిల్లు, తిరగొద్దే వాచు ముల్లు.. నీకు రెక్కలిచ్చే ఒళ్ళు, ఎగిరెళ్లు” అంటూ తేలికైన పదాలతో పాటను ఎంతో అందంగా, అర్థవంతంగా రాశారు. ఇక ఉత్సాహవంతమైన సంగీతానికి తగ్గట్టుగా
Also Read
అద్నాన్ సమీ, పాయల్ దేవ్ పాటను మరింత ఉత్సాహంగా ఆలపించారు. సంగీతం, సాహిత్యం, గానంతో పాటు శిరీష్ నృత్య రీతులు ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముంబై బీచ్ తో పాటు నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ, నాయకానాయికలు వేసిన స్టెప్పులు అలరించాయి. లిరికల్ వీడియోనే ఇలా ఉంటే, బిగ్ స్క్రీన్ మీద ఫుల్ వీడియో సాంగ్ కి థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ఖాయమని చెప్పొచ్చు. పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా రూపుదిద్దుకుంటున్న ఈ వినోదాత్మక చిత్రం ఘన విజయం సాధిస్తుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!