Site icon NTV Telugu

Dhamaka: ఈడు నిజంగానే మాస్ మహారాజా ఎహే…

Dhamaka

Dhamaka

ఏదైనా హీరో సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే ఆ ఇంపాక్ట్ అతని నెక్స్ట్ సినిమా మార్కెట్ పై పడుతుంది. అదే బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు ఫ్లాప్స్ పడితే ఆ హీరో సినిమా కొనడానికి కూడా బయ్యర్స్ ఉండరు. హిట్ లో ఉంటేనే ఆడియన్స్ కూడా ఆ హీరోని కన్సిడర్ చేస్తారు. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది ఒక్క హీరోకి తప్ప. ఆ ఒక్కడి పేరే ‘రవితేజ’. ఈ మాస్ మహారాజా ఫ్లాప్ కొట్టిన ప్రతిసారి కెరీర్ అయిపొయింది అనడం అందరికీ అలవాటు అయిపొయింది. ఎవరు ఎన్నిసార్లు తన పని అయిపొయింది అని విమర్శ చేసినా ఆ కామెంట్స్ ని సైలెంట్ చేసే రేంజులో కంబ్యాక్ ఇవ్వడం రవితేజకి కూడా అలవాటు అయిపొయింది. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన ‘ధమాకా’ సినిమానే అందుకు ఉదాహరణ.

ధమాకా సినిమా రిలీజ్ కి ముందు రవితేజ ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్నాడు, ధమాకా పైన ఎవరికీ పెద్దగా అంచనాలు కూడా లేవు. ఒక్కో సాంగ్ బయటకి వచ్చే కొద్దీ ధమాకా ఆడియన్స్ దృష్టిలో పడడం మొదలయ్యింది. బయటకి వచ్చిన ప్రతి పాట హిట్ అవుతూ ఉండడంతో ధమాకా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ధమాకా ట్రైలర్ కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ధమాకా సినిమాలో రవితేజ తనకి టైలర్ మేడ్ లాంటి పాత్రలో నటించినట్లు ఉన్నాడే అనుకోవడం మొదలుపెట్టారు. ప్రమోషన్స్ కి ఎప్పుడూ కాస్త దూరంగానే ఉండే రవితేజ, ధమాకా సినిమాని మాత్రం అగ్రెసివ్ గా ప్రమోట్ చేశాడు దీంతో ఈసారి రవితేజ హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలో కలిగింది.

గత వారం రోజులుగా సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ లెవల్ వరకూ ప్రతి చోటా ధమాకా సినిమా ప్రమోషనల్ కంటెంట్ మాత్రమే కనిపించడమే ఆడియన్స్ థియేటర్ కి వచ్చారు. ఫస్ట్ డే మార్నింగ్ షోకే హిట్ టాక్ బయటకి వచ్చేసింది. దీంతో రవితేజ హిట్ కొడితే చూడాలి అనుకున్న మాస్ మహారాజ అభిమానులంతా రిపీట్ వేస్తున్నారు. అందరు హీరోలకి ఫాన్స్ ఉంటారు కానీ అందరూ హీరోల అభిమానులు రవితేజ అభిమానులే… అందుకే రవితేజ హిట్ కొట్టాడు అనే టాక్ స్ప్రెడ్ అవ్వగానే ధమాకా సినిమాకి బుకింగ్స్ పెరిగాయి. క్రిస్మస్ హాలిడే కూడా కలిసి రావడంతో ధమాకా సినిమా రెండు రోజుల్లోనే 19 కోట్లు రాబట్టి టాలీవుడ్ 2022 బాక్సాఫీస్ కి గ్రాండ్ ఎండింగ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ ట్రెండ్ కంటిన్యు అయితే చాలు ధమాకా సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం గ్యారెంటి. ఈ సినిమా చేస్తున్న సాలిడ్ సౌండ్ అయినా రవితేజ పని అయిపొయింది అనే రూమర్ కి ఎండ్ కార్డ్ వేస్తుందేమో చూడాలి.

Exit mobile version