Site icon NTV Telugu

Dhamaka: ఒరేయ్ ఆజాము… మాస్ పార్టీ మొదలయ్యింది రోయ్…

Dhamaka

Dhamaka

మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ సినిమాతో కొట్టిన హిట్ సౌండ్, తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఫస్ట్ వీక్ కే 56 కోట్ల గ్రాస్ రాబట్టిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన రవితేజ ఫాన్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే మేకర్స్ ‘మాస్ పార్టీ’ (సక్సస్ సెలబ్రేషన్స్)ని గ్రాండ్ గా చేస్తున్నారు. హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో మరి కాసేపట్లో ‘ధమాకా మాస్ పార్టీ జగరనుంది. ఇప్పటికే మాస్ మహారాజ ఫాన్స్ లోకేషన్ ని రీచ్ అయ్యి సందడి చేస్తున్నారు. గత రెండు సినిమాలతో హిట్టుకి దూరమైన రవితేజ, సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. దీంతో రవితేజ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు, ఇదే జోష్ మాస్ పార్టీలో కూడా కనిపించనుంది. ఆ స్టేజ్ పైన రవితేజ, శ్రీలీలా, రైటర్ ప్రసన్న కుమార్, డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన, కమెడియన్ హైపర్ ఆదిలు కలిసి పల్సర్ బండి సాంగ్ కి రెండు స్టెప్పులు వేస్తే ఉంటది నా సామిరంగా… JRC మోత మొగిపోద్ది.

ఆ రేంజ్ సెలబ్రేషన్స్ ని కూడా ఈ మధ్య కాలంలో ఏ సూపర్ హిట్ సినిమాకి కూడా చూడలేదు కాబట్టి రవితేజ ఫాన్స్ లో ఉన్న జోష్ ని మరింత పెంచడానికి రెండు స్టెప్పులు వేస్తే సూపర్ ఉంటుంది. మాస్ పార్టీలో రవితేజ తన అభిమానులకి ఇచ్చే జోష్, ధమాకా సినిమా కలెక్షన్స్ మరింత పెరగడానికి హెల్ప్ అవుతుంది. సంక్రాంతి సీజన్ వరకూ పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాల గురించి ఆడియన్స్ కి పెద్దగా తెలియదు. సో ఇప్పట్లో ధమాకా సినిమా థియేటర్స్ కౌంట్ కి వచ్చే నష్టం ఏమీ లేదు, కలెక్షన్స్ లో పెద్దగా డ్రాప్ కూడా కనిపించట్లేదు కాబట్టి మాస్ మహారాజ అభిమానులంతా ఇంకోసారి రిపీట్ వేసుకుంటే చాలు ధమాకా మూవీ వంద కోట్ల గ్రాస్ ని రాబట్టడం చాలా ఈజీ. ప్రస్తుతం 60 కోట్ల దగ్గర ఉన్న గ్రాస్, వంద కోట్ల వరకూ వెళ్లడానికి ఈరోజు జరుగుతున్న ధమాకా మాస్ పార్టీ ఎంతో హెల్ప్ అవ్వనుంది. మరి మాస్ మహారాజ ఆ వంద కోట్ల మార్క్ ని రీచ్ అవుతాడో లేదో చూడాలి.

Read Also: Dhamaka: ఈడు నిజంగానే మాస్ మహారాజా ఎహే…

Exit mobile version