NTV Telugu Site icon

NTR: మ్యాన్ ఆఫ్ మాసేస్ కోసం వస్తున్న మాస్ కా దాస్…

Ntr

Ntr

మ్యాన్ ఆఫ్ మాసేస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ కా దాస్ ఎంత పెద్ద అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తనకి ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఓపెన్ గానే చెప్పే విశ్వక్ సేన్… గతంలో ఎన్టీఆర్ బర్త్ డేకి స్పెషల్ సాంగ్ నే చేశాడు అంటే విశ్వక్, ఎన్టీఆర్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అర్ధం చేసుకోవచ్చు. తన ఫేవరేట్ హీరో కోసం విశ్వక్ ఎంత చేశాడో… విశ్వక్ ని అవసరమైన సమయంలో ఎన్టీఆర్ కూడా అంతే అండగా నిలిచాడు. తన సొంత ప్రొడక్షన్ లో, సంపాదించింది అంతా పెట్టి స్వియ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమా చేశాడు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వచ్చాడు. విశ్వక్ సేన్ తన భాద్యత అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ నందమూరి-విశ్వక్ సేన్ మ్యూచువల్ ఫాన్స్ కి కిక్ ఇచ్చింది. లేటెస్ట్ గా మరోసారి ఎన్టీఆర్ కోసం విశ్వక్ సేన్ కదిలోస్తున్నాడు.

మే 20న ఎన్టీఆర్ ఫాన్స్ సింహాద్రి సినిమాని గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. ముందెన్నడూ ఒక రీరిలీజ్ సినిమాకి చూడనంత హంగామా చేస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్, సింహాద్రి రీరిలీజ్ కోసం ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా చేస్తున్నారు. రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్ చెయ్యడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం వెనక్కి తగ్గకుండా, రీరిలీజ్ ట్రెండ్ లోనే ఒక హిస్టరీ క్రియేట్ చేస్తూ సింహాద్రి రీరిలీజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని మే 17న జేఆర్సీ కన్వెన్షన్ లో చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే ఉండే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా విశ్వక్ సేన్ వస్తున్నట్లు సమాచారం. విశ్వక్ సేన్ వస్తే ప్రీరిలీజ్ ఈవెంట్ లో మంచి జోష్ వచ్చినట్లే. మరి ఈ ఫాన్స్ అంతా కలిసి సింహాద్రి రీరిలీజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఏ రేంజులో సెలబ్రేట్ చేస్తారో చూడాలి.