Site icon NTV Telugu

Kathryn Hahn: మార్వెల్ స్టార్ కు ‘అలా’ ఉండడమే ఇష్టమట!!

Hollywood

Hollywood

Kathryn Hahn: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ కేథ్రిన్ హాన్ మాటలు వింటూఉంటే సహనటీనటులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు పాతికేళ్ళ నుండీ చిత్రసీమలో రాణిస్తోన్న కేథ్రిన్ ఒక్కసారిగా మార్వెల్ కామిక్ సిరీస్ తో స్టార్ అయిపోయింది. రెండేళ్ళ క్రితం రూపొందిన ‘వాండావిజన్’ మినీసిరీస్ లోనూ కేథ్రిన్ కీలక పాత్ర పోషించింది. దాంతో ఆమె స్టేటస్ ఎంతగానో మారిపోయింది. అయినప్పటికీ తాను ఓ సాధారణ మహిళగానే జీవనం సాగిస్తున్నానని చెబుతోంది కేథ్రిన్.

Russell Crowe: రస్సెల్ క్రోవ్ అసూయకు కారణమేంటి!?

తన సహ నటుడు ఎథాన్ సాండ్లర్ ను 2002లో ప్రేమించి పెళ్ళాడింది కేథ్రిన్. అప్పట్లో న్యూయార్క్ సిటీలో ఒకే ఒక బెడ్ రూమ్ ఉన్న ఫ్లాట్ లో తాము జీవితం ఆరంభించామని గుర్తు చేసుకుంటోంది. అప్పట్లో తానో చోట, తన భర్త సాండ్లర్ మరో చోట రిసెప్షనిస్ట్స్ గా పనిచేశామనీ గుర్తు చేసుకుంటోంది. ఆ రోజుల్లో తమకు ఒకే సింక్ ఉండేదని, తాను పాత్రలు కడగడానికి, సాండ్లర్ షేవింగ్ చేసుకోవడానికి దానినే ఉపయోగించేవారమని ఆ స్వీట్ మెమోరీస్ ను పంచుకుంటోంది. దాని కోసం ఇద్దరమూ గొడవపడేవాళ్ళమనీ, అదే తనకెంతో ఆనందాన్ని కలిగించేదని చెబుతోంది. ఇప్పుడు ఎంత సంపాదించినా, సాధారణంగా జీవించడానికే తామిద్దరమూ ఇష్టపడుతున్నామనీ అంటోంది. తమ పిల్లలకు కూడా తమ పాత జీవితం గురించి చెబుతూనే పెంచుతున్నామనీ వివరిస్తోంది. స్టార్ డమ్ వచ్చినా ఇప్పటికీ నార్మల్ పర్సన్ లాగే ఫీలవుతాననీ మరీ మరీ చెబుతోంది కేథ్రిన్ హాన్.

Exit mobile version